Al-Mu'minun

سورة المؤمنون

సూరా 23 · మక్కీ · 118 ఆయత్‌లు

23:1 · The believers have succeededజుజ్ 18 · పు. 342

قَدْ أَفْلَحَ الْمُؤْمِنُونَ1

వాస్తవానికి విశ్వాసులు సాఫల్యం పొందుతారు;
23:2జుజ్ 18 · పు. 342

الَّذِينَ هُمْ فِي صَلَاتِهِمْ خَاشِعُونَ2

వారే! ఎవరైతే తమ నమాజ్ లో వినమ్రత పాటిస్తారో!
23:3జుజ్ 18 · పు. 342

وَالَّذِينَ هُمْ عَنِ اللَّغْوِ مُعْرِضُونَ3

మరియు ఎవరైతే వ్యర్థమైన మాటల నుండి దూరంగా ఉంటారో;
23:4జుజ్ 18 · పు. 342

وَالَّذِينَ هُمْ لِلزَّكَاةِ فَاعِلُونَ4

మరియు ఎవరైతే విధిదానం (జకాత్) సక్రమంగా చెల్లిస్తారో!
23:5జుజ్ 18 · పు. 342

وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ5

మరియు ఎవరైతే తమ మర్మాంగాలను కాపాడుకుంటారో -
23:6జుజ్ 18 · పు. 342

إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ6

తమ భార్యలతో (అజ్వాజ్ లతో) లేక తమ ఆధీనంలో (కుడిచేతిలో) ఉన్న బానిస స్త్రీలతో తప్ప! అలాంటప్పుడు వారు నిశ్చయంగా, నిందార్హులు కారు.
23:7జుజ్ 18 · పు. 342

فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعَادُونَ7

కాని ఎవరైతే దీనిని మించి కోరుతారో! అలాంటి వారే వాస్తవంగా హద్దులను అతిక్రమించిన వారు.
23:8జుజ్ 18 · పు. 342

وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ8

మరియు వారు ఎవరైతే తమ పూచీలను (అమానతులను) మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో.
23:9జుజ్ 18 · పు. 342

وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَوَاتِهِمْ يُحَافِظُونَ9

మరియు వారు ఎవరైతే తమ నమాజ్ లను కాపాడుకుంటారో!
23:10జుజ్ 18 · పు. 342

أُولَٰئِكَ هُمُ الْوَارِثُونَ10

అలాంటి వారే (స్వర్గానికి) వారసులు అవుతారు.
23:11జుజ్ 18 · పు. 342

الَّذِينَ يَرِثُونَ الْفِرْدَوْسَ هُمْ فِيهَا خَالِدُونَ11

వారే ఫిరదౌస్ స్వర్గానికి వారసులై, అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
23:12జుజ్ 18 · పు. 342

وَلَقَدْ خَلَقْنَا الْإِنْسَانَ مِنْ سُلَالَةٍ مِنْ طِينٍ12

మరియు వాస్తవంగా, మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము.
23:13జుజ్ 18 · పు. 342

ثُمَّ جَعَلْنَاهُ نُطْفَةً فِي قَرَارٍ مَكِينٍ13

తరువాత అతనిని ఇంద్రియ బిందువుగా ఒక కోశంలో భద్రంగా ఉంచాము.
23:14జుజ్ 18 · పు. 342

ثُمَّ خَلَقْنَا النُّطْفَةَ عَلَقَةً فَخَلَقْنَا الْعَلَقَةَ مُضْغَةً فَخَلَقْنَا الْمُضْغَةَ عِظَامًا فَكَسَوْنَا الْعِظَامَ لَحْمًا ثُمَّ أَنْشَأْنَاهُ خَلْقًا آخَرَ ۚ فَتَبَارَكَ اللَّهُ أَحْسَنُ الْخَالِقِينَ14

ఆ తరువాత ఆ ఇంద్రియ బిందువును రక్తపు ముద్దగా (జలగగా) మార్చాము. ఆ పైన ఆ రక్తపు ముద్దను (జలగను) మాంసపు ముద్దగా (జీవాణువుల పిండంగా) మార్చాము, ఆ జీవాణువుల పిండంలో ఎముకలను ఏర్పరచి, ఆ ఎముకలను మాంసంతో కప్పాము. ఆ తరువాత దానిని మరొక (భిన్న) సృష్టిగా చేశాము. కావున శుభకరుడు (శుభప్రదుడు) అయిన అల్లాహ్ యే అత్యుత్తమ సృష్టికర్త.
23:15జుజ్ 18 · పు. 342

ثُمَّ إِنَّكُمْ بَعْدَ ذَٰلِكَ لَمَيِّتُونَ15

ఆ తరువాత మీరు నిశ్చయంగా, మరణిస్తారు.
23:16జుజ్ 18 · పు. 342

ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ تُبْعَثُونَ16

అటు పిమ్మట నిశ్చయంగా, మీరు పునరుత్థాన దినమున మరల లేపబడతారు.
23:17జుజ్ 18 · పు. 342

وَلَقَدْ خَلَقْنَا فَوْقَكُمْ سَبْعَ طَرَائِقَ وَمَا كُنَّا عَنِ الْخَلْقِ غَافِلِينَ17

మరియు వాస్తవానికి మేము మీపై ఏడు మార్గాలను (ఆకాశాలను) సృష్టించాము. మరియు మేము సృష్టి విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా లేము.
23:18జుజ్ 18 · పు. 343

وَأَنْزَلْنَا مِنَ السَّمَاءِ مَاءً بِقَدَرٍ فَأَسْكَنَّاهُ فِي الْأَرْضِ ۖ وَإِنَّا عَلَىٰ ذَهَابٍ بِهِ لَقَادِرُونَ18

మరియు మేము ఆకాశం నుండి ఒక పరిమాణంతో వర్షాన్ని (నీటిని) కురిపించాము, పిదప దానిని భూమిలో నిలువ జేశాము. మరియు నిశ్చయంగా, దానిని వెనక్కి తీసుకునే శక్తి మాకుంది.
23:19జుజ్ 18 · పు. 343

فَأَنْشَأْنَا لَكُمْ بِهِ جَنَّاتٍ مِنْ نَخِيلٍ وَأَعْنَابٍ لَكُمْ فِيهَا فَوَاكِهُ كَثِيرَةٌ وَمِنْهَا تَأْكُلُونَ19

తరువాత దాని ద్వారా మేము మీ కొరకు ఖర్జూరపు తోటలను ద్రాక్షతోటలను ఉత్పత్తి చేశాము; అందులో మీకు ఎన్నో ఫలాలు దొరుకుతాయి. మరియు వాటి నుండి మీరు తింటారు.
23:20జుజ్ 18 · పు. 343

وَشَجَرَةً تَخْرُجُ مِنْ طُورِ سَيْنَاءَ تَنْبُتُ بِالدُّهْنِ وَصِبْغٍ لِلْآكِلِينَ20

మరియు సినాయి కొండ ప్రాంతంలో ఒక వృక్షం పెరుగుతున్నది. అది నూనె ఇస్తుంది మరియు (దాని ఫలం) తినేవారికి రుచికరమైన (కూరగా) ఉపయోగపడుతుంది.
23:21జుజ్ 18 · పు. 343

وَإِنَّ لَكُمْ فِي الْأَنْعَامِ لَعِبْرَةً ۖ نُسْقِيكُمْ مِمَّا فِي بُطُونِهَا وَلَكُمْ فِيهَا مَنَافِعُ كَثِيرَةٌ وَمِنْهَا تَأْكُلُونَ21

మరియు నిశ్చయంగా, మీ పశువులలో మీకు ఒక గుణపాఠముంది. మేము వాటి కడుపులలో ఉన్నది (పాలు) మీకు త్రాపుతున్నాము. మరియు వాటిలో మీకు ఇంకా ఎన్నో ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మరియు వాటి (మాంసం) మీరు తింటారు.
23:22జుజ్ 18 · పు. 343

وَعَلَيْهَا وَعَلَى الْفُلْكِ تُحْمَلُونَ22

మరియు వాటి మీద మరియు ఓడల మీద మీరు సవారీ చేస్తారు.
23:23జుజ్ 18 · పు. 343

وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ فَقَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ أَفَلَا تَتَّقُونَ23

మరియు వాస్తవానికి మేము నూహ్ ను తన జాతి ప్రజల వద్దకు పంపాము. అతను వారితో అన్నాడు: "నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు! ఏమీ మీరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండరా?"
23:24జుజ్ 18 · పు. 343

فَقَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِنْ قَوْمِهِ مَا هَٰذَا إِلَّا بَشَرٌ مِثْلُكُمْ يُرِيدُ أَنْ يَتَفَضَّلَ عَلَيْكُمْ وَلَوْ شَاءَ اللَّهُ لَأَنْزَلَ مَلَائِكَةً مَا سَمِعْنَا بِهَٰذَا فِي آبَائِنَا الْأَوَّلِينَ24

అతని జాతిలోని సత్యతిరస్కారులైన నాయకులు ఇలా అన్నారు: "ఇతను మీ వంటి ఒక సాధారణ మానవుడే తప్ప మరేమీ కాడు! మీపై ఆధిక్యత పొందగోరుతున్నాడు. మరియు అల్లాహ్ తలుచుకుంటే దైవదూతలను పంపి ఉండేవాడు. ఇలాంటి విషయం పూర్వీకులైన మన తాతముత్తాతలలో కూడా జరిగినట్లు మేము వినలేదే!"
23:25జుజ్ 18 · పు. 343

إِنْ هُوَ إِلَّا رَجُلٌ بِهِ جِنَّةٌ فَتَرَبَّصُوا بِهِ حَتَّىٰ حِينٍ25

"ఇతడు కేవలం పిచ్చి పట్టిన మనిషి కావున కొంత కాలం ఇతనిని సహించండి."
23:26జుజ్ 18 · పు. 343

قَالَ رَبِّ انْصُرْنِي بِمَا كَذَّبُونِ26

(నూహ్) అన్నాడు: "ఓ నా ప్రభూ! వీరు నన్ను అసత్యపరుడని తిరస్కరిస్తున్నారు. కావున నాకు సహాయం చేయి."
23:27జుజ్ 18 · పు. 343

فَأَوْحَيْنَا إِلَيْهِ أَنِ اصْنَعِ الْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا فَإِذَا جَاءَ أَمْرُنَا وَفَارَ التَّنُّورُ ۙ فَاسْلُكْ فِيهَا مِنْ كُلٍّ زَوْجَيْنِ اثْنَيْنِ وَأَهْلَكَ إِلَّا مَنْ سَبَقَ عَلَيْهِ الْقَوْلُ مِنْهُمْ ۖ وَلَا تُخَاطِبْنِي فِي الَّذِينَ ظَلَمُوا ۖ إِنَّهُمْ مُغْرَقُونَ27

కావున మేము అతనికి ఈ విధంగా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "మా పర్యవేక్షణలో, మా దివ్యజ్ఞానం (వహీ) ప్రకారం ఒక ఓడను తయారు చెయ్యి. తరువాత మా ఆజ్ఞ వచ్చినప్పుడు మరియు పొయ్యి నుండి నీరు ఉబికినప్పుడు (పొంగినప్పుడు), ఆ నావలో ప్రతిరకపు జంతుజాతి నుండి ఒక్కొక్క జంటను మరియు నీ పరివారపు వారిని ఎక్కించుకో ఎవరిని గురించి అయితే ముందుగానే నిర్ణయం జరిగిందో వారు తప్ప! ఇక దుర్మార్గుల కొరకు నాతో మనవి చేయకు. నిశ్చయంగా, వారు ముంచి వేయబడతారు."
23:28జుజ్ 18 · పు. 344

فَإِذَا اسْتَوَيْتَ أَنْتَ وَمَنْ مَعَكَ عَلَى الْفُلْكِ فَقُلِ الْحَمْدُ لِلَّهِ الَّذِي نَجَّانَا مِنَ الْقَوْمِ الظَّالِمِينَ28

"ఆ తరువాత నీవు మరియు నీతో ఉన్నవారు నావలోకి ఎక్కిన పిదప ఇలా ప్రార్థించండి: 'సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే, ఆయనే మమ్మల్ని దుర్మార్గుల నుండి విమోచనం కలిగించాడు.'
23:29జుజ్ 18 · పు. 344

وَقُلْ رَبِّ أَنْزِلْنِي مُنْزَلًا مُبَارَكًا وَأَنْتَ خَيْرُ الْمُنْزِلِينَ29

ఇంకా ఇలా ప్రార్థించు: 'ఓ నా ప్రభూ! నన్ను శుభప్రదమైన గమ్యస్థానంలో దించు. గమ్యస్థానానికి చేర్పించే వారిలో నీవే అత్యుత్తముడవు!'"
23:30జుజ్ 18 · పు. 344

إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ وَإِنْ كُنَّا لَمُبْتَلِينَ30

నిశ్చయంగా, ఇందులో (ఈ గాథలో) సూచనలున్నాయి. మరియు నిశ్చయంగా, మేము (ప్రజలను) పరీక్షకు గురి చేస్తూ ఉంటాము.
23:31జుజ్ 18 · పు. 344

ثُمَّ أَنْشَأْنَا مِنْ بَعْدِهِمْ قَرْنًا آخَرِينَ31

వారి తరువాత మేము మరొక తరాన్ని పుట్టించాము.
23:32జుజ్ 18 · పు. 344

فَأَرْسَلْنَا فِيهِمْ رَسُولًا مِنْهُمْ أَنِ اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ أَفَلَا تَتَّقُونَ32

మరియు వారి వద్దకు వారి నుండియే, ఒక సందేశహరుణ్ణి పంపినప్పుడు, (అతను): "కేవలం అల్లాహ్ నే ఆరాధించండి. మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. ఏమీ? మీకు దైవభీతి లేదా?" అని అన్నాడు.
23:33జుజ్ 18 · పు. 344

وَقَالَ الْمَلَأُ مِنْ قَوْمِهِ الَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِلِقَاءِ الْآخِرَةِ وَأَتْرَفْنَاهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا مَا هَٰذَا إِلَّا بَشَرٌ مِثْلُكُمْ يَأْكُلُ مِمَّا تَأْكُلُونَ مِنْهُ وَيَشْرَبُ مِمَّا تَشْرَبُونَ33

దానికి, అతని జాతివారిలోని - సత్యతిరస్కారులైనట్టి వారు, పరలోక సమావేశాన్ని అబద్ధమని నిరాకరించేవారు మరియు ఇహలోక జీవితంలో మేము భాగ్యవంతులుగా చేసినట్టి - నాయకులు ఇలా అన్నారు: "ఇతను మీ వంటి సాధారణ మానవుడే తప్ప మరేమీ కాడు, మీరు తినేదే ఇతనూ తింటున్నాడు మరియు మీరు త్రాగేదే ఇతనూ త్రాగుతున్నాడు.
23:34జుజ్ 18 · పు. 344

وَلَئِنْ أَطَعْتُمْ بَشَرًا مِثْلَكُمْ إِنَّكُمْ إِذًا لَخَاسِرُونَ34

మరియు ఒకవేళ మీరు మీ వంటి ఒక సాధారణ మానవుణ్ణి అనుసరించినట్లైతే! నిశ్చయంగా, మీరు నష్టపడిన వారవుతారు.
23:35జుజ్ 18 · పు. 344

أَيَعِدُكُمْ أَنَّكُمْ إِذَا مِتُّمْ وَكُنْتُمْ تُرَابًا وَعِظَامًا أَنَّكُمْ مُخْرَجُونَ35

ఏమీ? మీరు మరణించి మట్టిగా ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా తిరిగి లేపబడతారని ఇతను మీకు వాగ్దానం చేస్తున్నాడా?
23:36జుజ్ 18 · పు. 344

۞ هَيْهَاتَ هَيْهَاتَ لِمَا تُوعَدُونَ36

అసంభవం! మీకు చేయబడే ఈ వాగ్దానం నెరవేరటం అసంభవం.
23:37జుజ్ 18 · పు. 344

إِنْ هِيَ إِلَّا حَيَاتُنَا الدُّنْيَا نَمُوتُ وَنَحْيَا وَمَا نَحْنُ بِمَبْعُوثِينَ37

ఇక మన జీవితం ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే! మనం మరణించేది జీవించేది ఇక్కడే! మనం ఏ మాత్రమూ తిరిగి సజీవులుగా లేపబడము!
23:38జుజ్ 18 · పు. 344

إِنْ هُوَ إِلَّا رَجُلٌ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا وَمَا نَحْنُ لَهُ بِمُؤْمِنِينَ38

ఇక ఇతను, ఈ వ్యక్తి అల్లాహ్ పేరుతో కేవలం అబద్ధాలు కల్పిస్తున్నాడు మరియు మేము ఇతనిని (ఇతని మాటలను) ఎన్నటికీ విశ్వసించలేము."
23:39జుజ్ 18 · పు. 344

قَالَ رَبِّ انْصُرْنِي بِمَا كَذَّبُونِ39

(ఆ ప్రవక్త) అన్నాడు: "ఓ నా ప్రభూ! వీరు చేసే నిందారోపణల నుండి నన్ను కాపాడు."
23:40జుజ్ 18 · పు. 344

قَالَ عَمَّا قَلِيلٍ لَيُصْبِحُنَّ نَادِمِينَ40

(అల్లాహ్) ఇలా సెలవిచ్చాడు: "వీరు కొంతకాలంలోనే పశ్చాత్తాప పడతారు."
23:41జుజ్ 18 · పు. 344

فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ بِالْحَقِّ فَجَعَلْنَاهُمْ غُثَاءً ۚ فَبُعْدًا لِلْقَوْمِ الظَّالِمِينَ41

ఆ తరువాత సత్య (వాగ్దాన) ప్రకారం ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) వారిని చుట్టు ముట్టింది. మేము వారిని చెత్తా చెదారంగా మార్చి వేశాము. ఇక దుర్మార్గులైన జాతివారు ఈ విధంగానే దూరమై పోతారు (నాశనం చేయబడతారు)!
23:42జుజ్ 18 · పు. 344

ثُمَّ أَنْشَأْنَا مِنْ بَعْدِهِمْ قُرُونًا آخَرِينَ42

వారి తరువాత ఇతర తరాల వారిని పుట్టించాము.
23:43జుజ్ 18 · పు. 345

مَا تَسْبِقُ مِنْ أُمَّةٍ أَجَلَهَا وَمَا يَسْتَأْخِرُونَ43

ఏ సమాజం వారు కూడా తమకు (నియమింపబడిన) గడువుకు ముందు కాలేరు మరియు దానికి వెనుక కాలేరు.
23:44జుజ్ 18 · పు. 345

ثُمَّ أَرْسَلْنَا رُسُلَنَا تَتْرَىٰ ۖ كُلَّ مَا جَاءَ أُمَّةً رَسُولُهَا كَذَّبُوهُ ۚ فَأَتْبَعْنَا بَعْضَهُمْ بَعْضًا وَجَعَلْنَاهُمْ أَحَادِيثَ ۚ فَبُعْدًا لِقَوْمٍ لَا يُؤْمِنُونَ44

ఆ తరువాత మేము మా సందేశహరులను ఒకరి తరువాత ఒకరిని పంపుతూ వచ్చాము. ప్రతిసారి ఒక సమాజం వద్దకు దాని సందేశహరుడు వచ్చినప్పుడు, వారు అతనిని అసత్యుడని తిరస్కరించారు. వారిని ఒకరి తరువాత ఒకరిని నశింపజేస్తూ వచ్చాము. చివరకు వారిని గాథలుగా చేసి వదిలాము. ఇక విశ్వసించని ప్రజలు ఈ విధంగా దూరమై పోవుగాక (నాశనం చేయబడుగాక!)
23:45జుజ్ 18 · పు. 345

ثُمَّ أَرْسَلْنَا مُوسَىٰ وَأَخَاهُ هَارُونَ بِآيَاتِنَا وَسُلْطَانٍ مُبِينٍ45

ఆ తరువాత మూసా మరియు అతని సోదరుడు హారూన్ లను మా సూచనలతో మరియు స్పష్టమైన ప్రమాణంతో పంపాము;
23:46జుజ్ 18 · పు. 345

إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ فَاسْتَكْبَرُوا وَكَانُوا قَوْمًا عَالِينَ46

ఫిర్ఔన్ మరియు అతని నాయకుల వద్దకు. కాని వారు దురహంకారం చూపారు. వారు తమ అహంభావంలో మునిగి ఉండేవారు.
23:47జుజ్ 18 · పు. 345

فَقَالُوا أَنُؤْمِنُ لِبَشَرَيْنِ مِثْلِنَا وَقَوْمُهُمَا لَنَا عَابِدُونَ47

అపుడు వారన్నారు: "ఏమీ? మేము మా వంటి ఈ ఇద్దరు మానవులను విశ్వసించాలా? మరియు ఎవరి జాతి వారైతే మా బానిసలుగా ఉన్నారో!"
23:48జుజ్ 18 · పు. 345

فَكَذَّبُوهُمَا فَكَانُوا مِنَ الْمُهْلَكِينَ48

కావున వారు, ఆ ఇరువురిని అసత్యవాదులని తిరస్కరించి, నాశనం చేయబడిన వారిలో చేరిపోయారు.
23:49జుజ్ 18 · పు. 345

وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ لَعَلَّهُمْ يَهْتَدُونَ49

మరియు వాస్తవానికి మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము, బహుశా వారు మార్గదర్శకత్వం పొందుతారేమోనని!
23:50జుజ్ 18 · పు. 345

وَجَعَلْنَا ابْنَ مَرْيَمَ وَأُمَّهُ آيَةً وَآوَيْنَاهُمَا إِلَىٰ رَبْوَةٍ ذَاتِ قَرَارٍ وَمَعِينٍ50

ఇక మర్యమ్ కుమారుణ్ణి మరియు అతని తల్లిని మేము (మా అనుగ్రహపు) సూచనగా చేశాము. మరియు వారిద్దరికి ఉన్నతమైన, ప్రశాంతమైన నీడ, ప్రవహించే సెలయేళ్ళు మరియు చెలమలు గల స్థానంలో ఆశ్రయమిచ్చాము.
23:51జుజ్ 18 · పు. 345

يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا ۖ إِنِّي بِمَا تَعْمَلُونَ عَلِيمٌ51

ఓ సందేశహరులారా! పరిశుద్ధమైన వస్తువులనే తినండి మరియు సత్కార్యాలు చేయండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా నాకు బాగా తెలుసు.
23:52జుజ్ 18 · పు. 345

وَإِنَّ هَٰذِهِ أُمَّتُكُمْ أُمَّةً وَاحِدَةً وَأَنَا رَبُّكُمْ فَاتَّقُونِ52

మరియు నిశ్చయంగా, మీ ఈ సమాజం ఒకే ఒక్క సమాజం మరియు నేనే మీ ప్రభువును, కావున మీరు నా యందే భయభక్తులు కలిగి ఉండండి.
23:53జుజ్ 18 · పు. 345

فَتَقَطَّعُوا أَمْرَهُمْ بَيْنَهُمْ زُبُرًا ۖ كُلُّ حِزْبٍ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ53

కాని వారు తమ (ధర్మం) విషయంలో పరస్పర భేదాభిప్రాయాలు కల్పించుకొని, విభిన్న తెగలుగా చీలిపోయారు. ప్రతి వర్గం వారు, తాము అనుసరించే దానితో సంతోషపడుతున్నారు.
23:54జుజ్ 18 · పు. 345

فَذَرْهُمْ فِي غَمْرَتِهِمْ حَتَّىٰ حِينٍ54

కావున వారిని కొంత కాలం వరకు వారి మూఢత్వంలోనే మునిగి ఉండనివ్వు.
23:55జుజ్ 18 · పు. 345

أَيَحْسَبُونَ أَنَّمَا نُمِدُّهُمْ بِهِ مِنْ مَالٍ وَبَنِينَ55

ఏమీ? మేము వారికి సంపదలు మరియు సంతానం సమృద్ధిగా ఇస్తున్నామంటే!
23:56జుజ్ 18 · పు. 345

نُسَارِعُ لَهُمْ فِي الْخَيْرَاتِ ۚ بَلْ لَا يَشْعُرُونَ56

మేము వారికి మేలు చేయటంలో తొందరపడుతున్నామని, వారు భావిస్తున్నారా? అలా కాదు వారు గ్రహించటం లేదు!
23:57జుజ్ 18 · పు. 345

إِنَّ الَّذِينَ هُمْ مِنْ خَشْيَةِ رَبِّهِمْ مُشْفِقُونَ57

నిశ్చయంగా, ఎవరైతే, తమ ప్రభువు భయం వల్ల, భీతిపరులై ఉంటారో;
23:58జుజ్ 18 · పు. 345

وَالَّذِينَ هُمْ بِآيَاتِ رَبِّهِمْ يُؤْمِنُونَ58

మరియు ఎవరైతే, తమ ప్రభువు ఆయాతులను విశ్వసిస్తారో;
23:59జుజ్ 18 · పు. 345

وَالَّذِينَ هُمْ بِرَبِّهِمْ لَا يُشْرِكُونَ59

మరియు ఎవరైతే తమ ప్రభువుకు ఎవ్వరినీ సాటిగా (భాగస్వాములుగా) కల్పించరో;
23:60జుజ్ 18 · పు. 346

وَالَّذِينَ يُؤْتُونَ مَا آتَوْا وَقُلُوبُهُمْ وَجِلَةٌ أَنَّهُمْ إِلَىٰ رَبِّهِمْ رَاجِعُونَ60

మరియు ఎవరైతే, తాము ఇవ్వ వలసినది (జకాత్) ఇచ్చేటప్పుడు, నిశ్చయంగా, వారు తమ ప్రభువు వైపుకు మరలిపోవలసి ఉన్నదనే భయాన్ని తమ హృదయాలలో ఉంచుకొని ఇస్తారో;
23:61జుజ్ 18 · పు. 346

أُولَٰئِكَ يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَهُمْ لَهَا سَابِقُونَ61

ఇలాంటి వారే మంచిపనులు చేయటంలో పోటీ పడేవారు. మరియు వారు వాటిని చేయటానికి అందరి కంటే ముందు ఉండేవారు.
23:62జుజ్ 18 · పు. 346

وَلَا نُكَلِّفُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۖ وَلَدَيْنَا كِتَابٌ يَنْطِقُ بِالْحَقِّ ۚ وَهُمْ لَا يُظْلَمُونَ62

మరియు మేము ఏ ప్రాణి పై కూడా దాని శక్తికి మించిన భారం వేయము. మరియు మా వద్ద అంతా వ్రాయబడిన ఒక గ్రంథముంది. అది సత్యాన్ని పలుకుతుంది. మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.
23:63జుజ్ 18 · పు. 346

بَلْ قُلُوبُهُمْ فِي غَمْرَةٍ مِنْ هَٰذَا وَلَهُمْ أَعْمَالٌ مِنْ دُونِ ذَٰلِكَ هُمْ لَهَا عَامِلُونَ63

అలా కాదు, వారి హృదయాలు దీనిని గురించి అజ్ఞానంలో పడి ఉన్నాయి. ఇంతేగాక వారు చేసే (దుష్ట) కార్యాలు ఎన్నో ఉన్నాయి వారు వాటిని చూస్తునే ఉంటారు.
23:64జుజ్ 18 · పు. 346

حَتَّىٰ إِذَا أَخَذْنَا مُتْرَفِيهِمْ بِالْعَذَابِ إِذَا هُمْ يَجْأَرُونَ64

చివరకు, వారిలోని ఇహలోక భోగభాగ్యాలలో మునిగి ఉన్న వారిని శిక్షించటానికి మేము పట్టుకున్నప్పుడు, వారు మొరపెట్టుకుంటారు.
23:65జుజ్ 18 · పు. 346

لَا تَجْأَرُوا الْيَوْمَ ۖ إِنَّكُمْ مِنَّا لَا تُنْصَرُونَ65

(అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): "ఈరోజు మీరు మొరపెట్టుకోకండి! నిశ్చయంగా, మా తరఫు నుండి మీకు ఎలాంటి సహాయం లభించడం జరుగదు.
23:66జుజ్ 18 · పు. 346

قَدْ كَانَتْ آيَاتِي تُتْلَىٰ عَلَيْكُمْ فَكُنْتُمْ عَلَىٰ أَعْقَابِكُمْ تَنْكِصُونَ66

వాస్తవానికి, నా సూచనలు మీకు వినిపించబడినప్పుడు, మీరు మీ మడమల మీద వెనుకకు తిరిగి పోయేవారు.
23:67జుజ్ 18 · పు. 346

مُسْتَكْبِرِينَ بِهِ سَامِرًا تَهْجُرُونَ67

దురహంకారంతో దానిని గురించి వ్యర్థపు ప్రలాపాలలో రాత్రులు గడుపుతూ ఉండేవారు.
23:68జుజ్ 18 · పు. 346

أَفَلَمْ يَدَّبَّرُوا الْقَوْلَ أَمْ جَاءَهُمْ مَا لَمْ يَأْتِ آبَاءَهُمُ الْأَوَّلِينَ68

ఏమీ? వారు ఈ (దైవ) వాక్కును గురించి ఎన్నడూ ఆలోచించలేదా? లేక వారి పూర్వీకులైన, వారి తాతముత్తాతల వద్దకు ఎన్నడూ రానిది, వారి వద్దకు వచ్చిందనా?
23:69జుజ్ 18 · పు. 346

أَمْ لَمْ يَعْرِفُوا رَسُولَهُمْ فَهُمْ لَهُ مُنْكِرُونَ69

లేక వారు తమ సందేశహరుణ్ణి ఎరుగరా? అందుకే అతన్ని తిరస్కరిస్తున్నారా?
23:70జుజ్ 18 · పు. 346

أَمْ يَقُولُونَ بِهِ جِنَّةٌ ۚ بَلْ جَاءَهُمْ بِالْحَقِّ وَأَكْثَرُهُمْ لِلْحَقِّ كَارِهُونَ70

లేక: "అతనికి పిచ్చిపట్టింది!" అని అంటున్నారా? వాస్తవానికి, అతను వారి వద్దకు సత్యాన్ని తెచ్చాడు. కాని చాలామంది సత్యాన్ని అసహ్యించుకుంటున్నారు.
23:71జుజ్ 18 · పు. 346

وَلَوِ اتَّبَعَ الْحَقُّ أَهْوَاءَهُمْ لَفَسَدَتِ السَّمَاوَاتُ وَالْأَرْضُ وَمَنْ فِيهِنَّ ۚ بَلْ أَتَيْنَاهُمْ بِذِكْرِهِمْ فَهُمْ عَنْ ذِكْرِهِمْ مُعْرِضُونَ71

మరియు ఒకవేళ సత్యమే వారి కోరికలకు అనుగుణంగా ఉంటే భూమ్యాకాశాలు మరియు వాటిలో ఉన్నదంతా నాశనమై పోయేది. వాస్తవానికి మేము వారి వద్దకు హితబోధను పంపాము. కాని వారు తమ హితబోధ నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు.
23:72జుజ్ 18 · పు. 346

أَمْ تَسْأَلُهُمْ خَرْجًا فَخَرَاجُ رَبِّكَ خَيْرٌ ۖ وَهُوَ خَيْرُ الرَّازِقِينَ72

లేక నీవు (ఓ ముహమ్మద్!) వారిని ప్రతిఫలం ఏమైనా అడుగుతున్నావా? నీ ప్రభువు ఇచ్చే ప్రతిఫలమే ఎంతో మేలైనది. ఆయనే అందరి కంటే శ్రేష్ఠుడైన ఉపాధి ప్రదాత.
23:73జుజ్ 18 · పు. 346

وَإِنَّكَ لَتَدْعُوهُمْ إِلَىٰ صِرَاطٍ مُسْتَقِيمٍ73

మరియు నిశ్చయంగా, నీవు వారిని ఋజుమార్గం వైపునకు పిలుస్తున్నావు.
23:74జుజ్ 18 · పు. 346

وَإِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ عَنِ الصِّرَاطِ لَنَاكِبُونَ74

మరియు నిశ్చయంగా, పరలోకాన్ని నమ్మని వారు (ఋజు) మార్గం నుండి వైదొలగిన వారే!
23:75జుజ్ 18 · పు. 347

۞ وَلَوْ رَحِمْنَاهُمْ وَكَشَفْنَا مَا بِهِمْ مِنْ ضُرٍّ لَلَجُّوا فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ75

ఒకవేళ మేము వారిని కరుణించి, (ఇహలోకంలో వారికున్న) ఆపదను తొలగించినా! వారు తలబిరుసుతనంతో పట్టు విడువకుండా త్రోవ తప్పి, సంచరిస్తూ ఉంటారు.
23:76జుజ్ 18 · పు. 347

وَلَقَدْ أَخَذْنَاهُمْ بِالْعَذَابِ فَمَا اسْتَكَانُوا لِرَبِّهِمْ وَمَا يَتَضَرَّعُونَ76

మరియు వాస్తవానికి, మేము వారిని శిక్షకు గురి చేశాము. అయినా వారు తమ ప్రభువు ముందు వంగలేదు మరియు వారు వినమ్రులు కూడా కాలేదు.
23:77జుజ్ 18 · పు. 347

حَتَّىٰ إِذَا فَتَحْنَا عَلَيْهِمْ بَابًا ذَا عَذَابٍ شَدِيدٍ إِذَا هُمْ فِيهِ مُبْلِسُونَ77

చివరకు మేము వారి కొరకు కఠిన శిక్షా ద్వారాన్ని తెరిచాము. అప్పుడు వారు నిరాశ చెందిన వారయ్యారు.
23:78జుజ్ 18 · పు. 347

وَهُوَ الَّذِي أَنْشَأَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۚ قَلِيلًا مَا تَشْكُرُونَ78

మరియు ఆయనే, మీకు వినే శక్తినీ, చూసే శక్తినీ మరియు (అర్థం చేసుకోవటానికి) హృదయాలను సృజించినవాడు! అయినా మీరెంత తక్కువగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు!
23:79జుజ్ 18 · పు. 347

وَهُوَ الَّذِي ذَرَأَكُمْ فِي الْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ79

మరియు మిమ్మల్ని భూమిపై వ్యాపింప జేసినవాడు ఆయనే. మరియు ఆయన వద్దనే మీరంతా సమావేశ పరచబడతారు.
23:80జుజ్ 18 · పు. 347

وَهُوَ الَّذِي يُحْيِي وَيُمِيتُ وَلَهُ اخْتِلَافُ اللَّيْلِ وَالنَّهَارِ ۚ أَفَلَا تَعْقِلُونَ80

మరియు మీకు జీవితాన్ని ఇచ్చేవాడు మరియు మరణింపజేసేవాడు ఆయనే! మరియు రాత్రింబవళ్ళ మార్పు ఆయన ఆధీనంలోనే ఉంది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా?
23:81జుజ్ 18 · పు. 347

بَلْ قَالُوا مِثْلَ مَا قَالَ الْأَوَّلُونَ81

కాని వారు తమ పూర్వీకులు పలికినట్లే పలుకుతున్నారు.
23:82జుజ్ 18 · పు. 347

قَالُوا أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ82

వారంటున్నారు: "ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారి పోయిన తరువాత కూడా మళ్ళీ సజీవులుగా లేపబడతామా?
23:83జుజ్ 18 · పు. 347

لَقَدْ وُعِدْنَا نَحْنُ وَآبَاؤُنَا هَٰذَا مِنْ قَبْلُ إِنْ هَٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ83

వాస్తవానికి, ఇటువంటి వాగ్దానాలు, మాకూ మరియు మాకు పూర్వం మా తాతముత్తాతలకు చేయబడినవే! వాస్తవానికి ఇవి కేవలం పూర్వకాలపు కట్టుకథలు మాత్రమే"
23:84జుజ్ 18 · పు. 347

قُلْ لِمَنِ الْأَرْضُ وَمَنْ فِيهَا إِنْ كُنْتُمْ تَعْلَمُونَ84

వారిని ఇలా అడుగు: "ఈ భూమి మరియు ఇందులో ఉన్నదంతా ఎవరికి చెందినదో మీకు తెలిస్తే చెప్పండి?"
23:85జుజ్ 18 · పు. 347

سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ أَفَلَا تَذَكَّرُونَ85

వారంటారు: "అల్లాహ్ కే!" వారితో అను: "అయినా మీరు హితోపదేశం స్వీకరించరా?"
23:86జుజ్ 18 · పు. 347

قُلْ مَنْ رَبُّ السَّمَاوَاتِ السَّبْعِ وَرَبُّ الْعَرْشِ الْعَظِيمِ86

వారిని అడుగు: "సప్తాకాశాల ప్రభువు మరియు సర్వోత్తమ సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు ఎవరు?"
23:87జుజ్ 18 · పు. 347

سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ أَفَلَا تَتَّقُونَ87

వారంటారు: "అల్లాహ్ మాత్రమే!" అని. వారితో అను: "అయితే మీరెందుకు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండరు?"
23:88జుజ్ 18 · పు. 347

قُلْ مَنْ بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَهُوَ يُجِيرُ وَلَا يُجَارُ عَلَيْهِ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ88

వారిని ఇలా అడుగు: "మీకు తెలిస్తే చెప్పండి! ప్రతిదానిపై పాలనాధికారం ఎవరి చేతిలో ఉంది? మరియు ప్రతిదానికి శరణమిచ్చేవాడు ఆయనే మరియు ఆయనకు వ్యతిరేకంగా శరణమివ్వగల వాడెవ్వడూ లేనివాడు, ఎవరు?"
23:89జుజ్ 18 · పు. 347

سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ فَأَنَّىٰ تُسْحَرُونَ89

వారంటారు: "అల్లాహ్ మాత్రమే!" వారితో అను: "అయితే మీరెందుకు మాయాజాలానికి గురవుతున్నారు (మోసగింపబడుతున్నారు)?"
23:90జుజ్ 18 · పు. 348

بَلْ أَتَيْنَاهُمْ بِالْحَقِّ وَإِنَّهُمْ لَكَاذِبُونَ90

అలా కాదు! మేము వారికి సత్యాన్ని అందజేశాము. మరియు నిశ్చయంగా, వారే అసత్యవాదులు!
23:91జుజ్ 18 · పు. 348

مَا اتَّخَذَ اللَّهُ مِنْ وَلَدٍ وَمَا كَانَ مَعَهُ مِنْ إِلَٰهٍ ۚ إِذًا لَذَهَبَ كُلُّ إِلَٰهٍ بِمَا خَلَقَ وَلَعَلَا بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ ۚ سُبْحَانَ اللَّهِ عَمَّا يَصِفُونَ91

అల్లాహ్ ఎవ్వరినీ కూడా తనకు సంతానంగా చేసుకోలేదు మరియు ఆయనతో పాటు మరొక ఆరాధ్య దేవుడు లేడు. అలా అయితే ప్రతి దేవుడు తన సృష్టితో వేరై పోయేవాడు మరియు వారు ఒకరిపై నొకరు ప్రాబల్యం పొందగోరేవారు. అల్లాహ్! వారు కల్పించే వాటికి అతీతుడు.
23:92జుజ్ 18 · పు. 348

عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ92

ఆయన అగోచర మరియు గోచర విషయాల జ్ఞానం గలవాడు. వారు సాటి కల్పించే భాగస్వాముల కంటే, ఆయన అత్యున్నతుడు.
23:93జుజ్ 18 · పు. 348

قُلْ رَبِّ إِمَّا تُرِيَنِّي مَا يُوعَدُونَ93

(ఓ ముహమ్మద్!) ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! ఏ (శిక్ష అయితే) వారికి (అవిశ్వాసులకు) వాగ్దానం చేయబడి ఉన్నదో దానిని నీవు నాకు చూపనున్నచో!
23:94జుజ్ 18 · పు. 348

رَبِّ فَلَا تَجْعَلْنِي فِي الْقَوْمِ الظَّالِمِينَ94

ఓ నా ప్రభూ! నన్ను ఈ దుర్మార్గ ప్రజలలో చేర్చకు."
23:95జుజ్ 18 · పు. 348

وَإِنَّا عَلَىٰ أَنْ نُرِيَكَ مَا نَعِدُهُمْ لَقَادِرُونَ95

మరియు నిశ్చయంగా, మేము వారికి (అవిశ్వాసులకు) వాగ్దానము చేసింది (శిక్ష) నీకు చూపగల సమర్ధులము.
23:96జుజ్ 18 · పు. 348

ادْفَعْ بِالَّتِي هِيَ أَحْسَنُ السَّيِّئَةَ ۚ نَحْنُ أَعْلَمُ بِمَا يَصِفُونَ96

చెడును, మంచితనముతో నివారించు. వారు ఆపాదించే విషయాలు మాకు బాగా తెలుసు.
23:97జుజ్ 18 · పు. 348

وَقُلْ رَبِّ أَعُوذُ بِكَ مِنْ هَمَزَاتِ الشَّيَاطِينِ97

మరియు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! షైతానులు రేకెత్తించే కలతల నుండి (రక్షణ పొందటానికి) నేను నీ శరణు వేడుకుంటున్నాను.
23:98జుజ్ 18 · పు. 348

وَأَعُوذُ بِكَ رَبِّ أَنْ يَحْضُرُونِ98

మరియు ఓ నా ప్రభూ! అవి నా వద్దకు రాకుండా ఉండాలని, నేను నీ శరణు వేడుకుంటున్నాను."
23:99జుజ్ 18 · పు. 348

حَتَّىٰ إِذَا جَاءَ أَحَدَهُمُ الْمَوْتُ قَالَ رَبِّ ارْجِعُونِ99

చివరికి వారిలో ఒకడికి మరణం సమీపించినప్పుడు వాడిలా వేడుకుంటాడు: "ఓ నా ప్రభూ! నన్ను తిరిగి (భూలోకానికి) పంపు:
23:100జుజ్ 18 · పు. 348

لَعَلِّي أَعْمَلُ صَالِحًا فِيمَا تَرَكْتُ ۚ كَلَّا ۚ إِنَّهَا كَلِمَةٌ هُوَ قَائِلُهَا ۖ وَمِنْ وَرَائِهِمْ بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ100

నేను చేయకుండా వచ్చిన సత్కార్యాలు చేయటానికి." అది కాని పని. నిశ్చయంగా అది అతని నోటిమాట మాత్రమే! ఇక (ఈ మరణించిన) వారు తిరిగి లేపబడే దినం వరకు వారి ముందు ఒక అడ్డుతెర (బర్ జఖ్) ఉంటుంది.
23:101జుజ్ 18 · పు. 348

فَإِذَا نُفِخَ فِي الصُّورِ فَلَا أَنْسَابَ بَيْنَهُمْ يَوْمَئِذٍ وَلَا يَتَسَاءَلُونَ101

ఆ తరువాత బాగా ఊదబడిన దినమున వారి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండవు. మరియు వారు ఒకరి నొకరు పలుకరించుకోరు కూడా!
23:102జుజ్ 18 · పు. 348

فَمَنْ ثَقُلَتْ مَوَازِينُهُ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ102

ఇక ఎవరి (సత్కార్యాల) పళ్ళాలు బరువుగా ఉంటాయో, ఆలాంటి వారే సాఫల్యం పొందేవారు.
23:103జుజ్ 18 · పు. 348

وَمَنْ خَفَّتْ مَوَازِينُهُ فَأُولَٰئِكَ الَّذِينَ خَسِرُوا أَنْفُسَهُمْ فِي جَهَنَّمَ خَالِدُونَ103

మరియు ఎవరి పళ్ళాలు తేలికగా ఉంటాయో, అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేసుకున్న వారు, వారే నరకంలో శాశ్వతంగా ఉండేవారు.
23:104జుజ్ 18 · పు. 348

تَلْفَحُ وُجُوهَهُمُ النَّارُ وَهُمْ فِيهَا كَالِحُونَ104

అగ్ని వారి ముఖాలను కాల్చి వేస్తుంది. వారి పెదవులు బిగించుకు పోయి, పళ్ళు బయట పడతాయి.
23:105జుజ్ 18 · పు. 349

أَلَمْ تَكُنْ آيَاتِي تُتْلَىٰ عَلَيْكُمْ فَكُنْتُمْ بِهَا تُكَذِّبُونَ105

(వారిని అల్లాహ్ ఇలా ప్రశ్నిస్తాడు): "ఏమీ? నా సూచనలు మీకు వినిపించబడలేదా? అప్పుడు మీరు వాటిని అసత్యాలని తిరస్కరిస్తూ ఉండేవారు కదా?"
23:106జుజ్ 18 · పు. 349

قَالُوا رَبَّنَا غَلَبَتْ عَلَيْنَا شِقْوَتُنَا وَكُنَّا قَوْمًا ضَالِّينَ106

వారిలా అంటారు: "ఓ మా ప్రభూ! మా దురదృష్టం మమ్మల్ని క్రమ్ముకొని ఉండింది. మేము మార్గభ్రష్టులమైన వారిగా ఉండేవారం!
23:107జుజ్ 18 · పు. 349

رَبَّنَا أَخْرِجْنَا مِنْهَا فَإِنْ عُدْنَا فَإِنَّا ظَالِمُونَ107

ఓ మా ప్రభూ! మమ్మల్ని దీని (ఈ నరకం) నుండి బయటకు తీయి. ఒకవేళ మేము మరల (పాపాలు) చేస్తే, మేము నిశ్చయంగా, దుర్మార్గులమే!"
23:108జుజ్ 18 · పు. 349

قَالَ اخْسَئُوا فِيهَا وَلَا تُكَلِّمُونِ108

ఆయన (అల్లాహ్) అంటాడు: "దానిలోనే పరాభవంతో పడి ఉండండి మరియు నాతో మాట్లాడకండి!"
23:109జుజ్ 18 · పు. 349

إِنَّهُ كَانَ فَرِيقٌ مِنْ عِبَادِي يَقُولُونَ رَبَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا وَأَنْتَ خَيْرُ الرَّاحِمِينَ109

నిశ్చయంగా, నా దాసులలో కొందరు ఇలా ప్రార్థించే వారున్నారు: "ఓ మా ప్రభూ! మేము విశ్వసించాము, మమ్మల్ని క్షమించు మరియు మమ్మల్ని కరుణించు మరియు కరుణించేవారిలో నీవే అత్యుత్తముడవు!"
23:110జుజ్ 18 · పు. 349

فَاتَّخَذْتُمُوهُمْ سِخْرِيًّا حَتَّىٰ أَنْسَوْكُمْ ذِكْرِي وَكُنْتُمْ مِنْهُمْ تَضْحَكُونَ110

కాని మీరు వారిని పరిహాసానికి గురి చేసేవారు, చివరకు (ఆ పరిహాసమే) మిమ్మల్ని నా ధ్యానం నుండి మరపింపజేసింది; మరియు మీరు వారి మీద నవ్వేవారు (ఎగతాళి చేసేవారు)!
23:111జుజ్ 18 · పు. 349

إِنِّي جَزَيْتُهُمُ الْيَوْمَ بِمَا صَبَرُوا أَنَّهُمْ هُمُ الْفَائِزُونَ111

నిశ్చయంగా, ఈ రోజు నేను వారికి, వారి సహనానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చాను. నిశ్చయంగా వారే విజయం పొందినవారు!
23:112జుజ్ 18 · పు. 349

قَالَ كَمْ لَبِثْتُمْ فِي الْأَرْضِ عَدَدَ سِنِينَ112

(అల్లాహ్) ఇలా ప్రశ్నిస్తాడు: "మీరు భూమిలో ఎన్ని సంవత్సరాలు గడిపారు?"
23:113జుజ్ 18 · పు. 349

قَالُوا لَبِثْنَا يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ فَاسْأَلِ الْعَادِّينَ113

వారిలా జవాబిస్తారు: "మేమక్కడ ఒక్క దినమో లేక దినపు కొంత భాగమో ఉంటిమి. లెక్క పెట్టిన వారిని అడుగు!"
23:114జుజ్ 18 · పు. 349

قَالَ إِنْ لَبِثْتُمْ إِلَّا قَلِيلًا ۖ لَوْ أَنَّكُمْ كُنْتُمْ تَعْلَمُونَ114

(అల్లాహ్) అంటాడు: "మీరక్కడ ఉన్నది కొంతకాలం మాత్రమే! ఒకవేళ ఇది మీరు తెలుసుకొని ఉంటే (ఎంత బాగుండేది)!"
23:115జుజ్ 18 · పు. 349

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ115

"ఏమీ? వాస్తవానికి మేము మిమ్మల్ని వృథాగానే పుట్టించామని మరియు మీరు మా వైపునకు ఎన్నడూ మరలి రారని భావించారా?"
23:116జుజ్ 18 · పు. 349

فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ رَبُّ الْعَرْشِ الْكَرِيمِ116

కావున (తెలుసుకోండి) అల్లాహ్ అత్యున్నతుడు, నిజమైన విశ్వసార్వభౌముడు, ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే గౌరవప్రదమైన సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు!
23:117జుజ్ 18 · పు. 349

وَمَنْ يَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ لَا بُرْهَانَ لَهُ بِهِ فَإِنَّمَا حِسَابُهُ عِنْدَ رَبِّهِ ۚ إِنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ117

ఇక ఎవడైనా అల్లాహ్ తో పాటు మరొక దైవాన్ని - తన వద్ద దాని కొరకు ఎలాంటి ఆధారం లేకుండానే - ప్రార్థిస్తాడో, నిశ్చయంగా అతని లెక్క అతని ప్రభువు వద్ద ఉంది. నిశ్చయంగా, సత్యతిరస్కారులు సాఫల్యము పొందలేరు.
23:118జుజ్ 18 · పు. 349

وَقُلْ رَبِّ اغْفِرْ وَارْحَمْ وَأَنْتَ خَيْرُ الرَّاحِمِينَ118

కావున నీవు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! నన్ను క్షమించు, నన్ను కరుణించు, కరుణించేవారిలో నీవే అత్యుత్తముడవు!"

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి