సూరా 23 · జుజ్ 18
Al-Mu'minun · 23:51
يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا ۖ إِنِّي بِمَا تَعْمَلُونَ عَلِيمٌ
ఓ సందేశహరులారా! పరిశుద్ధమైన వస్తువులనే తినండి మరియు సత్కార్యాలు చేయండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా నాకు బాగా తెలుసు.
తఫ్సీర్
ఓ దైవ ప్రవక్తల్లారా వేటిని తినటం మంచిదో వాటిలోంచి మేము మీ కొరకు సమ్మతము చేసిన వాటిని మీరు తినండి. మరియు మీరు ధర్మానికి అనుగుణంగా ఉన్న సత్కర్మలను చేయండి. నిశ్ఛయంగా మీరు చేస్తున్న కర్మల గురించి నాకు బాగా తెలుసు. మీ కర్మల్లోంచి ఏదీ నాపై గోప్యంగా ఉండదు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి