సూరా 23 · జుజ్ 18
Al-Mu'minun · 23:24
فَقَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِنْ قَوْمِهِ مَا هَٰذَا إِلَّا بَشَرٌ مِثْلُكُمْ يُرِيدُ أَنْ يَتَفَضَّلَ عَلَيْكُمْ وَلَوْ شَاءَ اللَّهُ لَأَنْزَلَ مَلَائِكَةً مَا سَمِعْنَا بِهَٰذَا فِي آبَائِنَا الْأَوَّلِينَ
అతని జాతిలోని సత్యతిరస్కారులైన నాయకులు ఇలా అన్నారు: "ఇతను మీ వంటి ఒక సాధారణ మానవుడే తప్ప మరేమీ కాడు! మీపై ఆధిక్యత పొందగోరుతున్నాడు. మరియు అల్లాహ్ తలుచుకుంటే దైవదూతలను పంపి ఉండేవాడు. ఇలాంటి విషయం పూర్వీకులైన మన తాతముత్తాతలలో కూడా జరిగినట్లు మేము వినలేదే!"
తఫ్సీర్
ఆయన జాతి వారిలో నుండి అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన పెద్దవారు,నాయకులు తమను అనుసరించే వారితో,సాధారణ ప్రజలతో ఇలా పలికారు : తాను ప్రవక్తనని వాదించే ఇతను మీలాంటి ఒక మనిషి మాత్రమే అతడు మీపై అధికారమును,నాయకత్వమును ఆశిస్తున్నాడు. ఒక వేళ అల్లాహ్ మా వద్దకు ఒక ప్రవక్తనే పంపించదలిస్తే అతన్ని దైవ దూతల్లోంచి పంపించేవాడు. అతడిని మనుషుల్లోంచి పంపించేవాడు కాదు. మాకన్న పూర్వం గతించిన పూర్వికుల వద్ద అతడు వాదిస్తున్నటువంటి దాన్ని మేము విన లేదు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి