సూరా 23 · జుజ్ 18

Al-Mu'minun · 23:27

فَأَوْحَيْنَا إِلَيْهِ أَنِ اصْنَعِ الْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا فَإِذَا جَاءَ أَمْرُنَا وَفَارَ التَّنُّورُ ۙ فَاسْلُكْ فِيهَا مِنْ كُلٍّ زَوْجَيْنِ اثْنَيْنِ وَأَهْلَكَ إِلَّا مَنْ سَبَقَ عَلَيْهِ الْقَوْلُ مِنْهُمْ ۖ وَلَا تُخَاطِبْنِي فِي الَّذِينَ ظَلَمُوا ۖ إِنَّهُمْ مُغْرَقُونَ

కావున మేము అతనికి ఈ విధంగా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "మా పర్యవేక్షణలో, మా దివ్యజ్ఞానం (వహీ) ప్రకారం ఒక ఓడను తయారు చెయ్యి. తరువాత మా ఆజ్ఞ వచ్చినప్పుడు మరియు పొయ్యి నుండి నీరు ఉబికినప్పుడు (పొంగినప్పుడు), ఆ నావలో ప్రతిరకపు జంతుజాతి నుండి ఒక్కొక్క జంటను మరియు నీ పరివారపు వారిని ఎక్కించుకో ఎవరిని గురించి అయితే ముందుగానే నిర్ణయం జరిగిందో వారు తప్ప! ఇక దుర్మార్గుల కొరకు నాతో మనవి చేయకు. నిశ్చయంగా, వారు ముంచి వేయబడతారు."

తఫ్సీర్

అప్పుడు మేము ఒక ఓడను మా పర్యవేక్షణలో,దాన్ని ఎలా తయారు చేయాలో మేము నీకు నేర్పంచిన విధంగా తయారు చేయమని వహీ ద్వారా తెలియపరచాము. అయితే వారి వినాశనముతో మా ఆదేశము వచ్చినప్పుడు,నీరు ఉడకబెడుతున్న ప్రదేశము నుండి బలంగా పొంగినప్పుడు అందులో (ఓడలో) ప్రాణం ఉన్న ప్రతి ఆడ,మగను సంతానము కొనసాగటానికి ప్రవేశింపజేయి. మరియు నీ ఇంటి వారిలోంచి నీ భార్య,నీకుమారుడు లాంటి వారు వినాశనం గురించి అల్లాహ్ మాట ముందే జరిగిపోయినదో వారు తప్ప ప్రవేశింపజేయి. మరియు నీవు వారి విషయంలో ఎవరైతే అవిశ్వాసముతో దుర్మార్గమునకు పాల్పడ్డారో వారి విముక్తిని,వారిని వినాశనమును వదిలివేయటమును ఆశిస్తూ నాతో మాట్లాడకు. నిశ్ఛయంగా వారు తుఫాను నీటిలో ముంచబడి ఖచ్చితంగా వినాశనమునకు గురి అవుతారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి