సూరా 9 · జుజ్ 10
At-Tawbah · 9:85
وَلَا تُعْجِبْكَ أَمْوَالُهُمْ وَأَوْلَادُهُمْ ۚ إِنَّمَا يُرِيدُ اللَّهُ أَنْ يُعَذِّبَهُمْ بِهَا فِي الدُّنْيَا وَتَزْهَقَ أَنْفُسُهُمْ وَهُمْ كَافِرُونَ
మరియు వారి సిరిసంపదలు మరియు వారి సంతానం నిన్ను ఆశ్చర్యానికి గురి చేయనివ్వకూడదు. నిశ్చయంగా, అల్లాహ్! వాటితో ఈ ప్రపంచంలో వారిని శిక్షించాలనీ మరియు వారు సత్యతిరస్కారులుగా ఉన్న స్థితిలోనే వారి ప్రాణాలను కోల్పోవాలనీ సంకల్పించాడు.
తఫ్సీర్
ఓ ప్రవక్తా ఈ కపట విశ్వాసులందరి సంపదలు,వారి సంతానము మిమ్మల్ని ఆశ్చర్యానికి లోను చేయకూడదు.కేవలం అల్లాహ్ వాటి ద్వారా వారిని ఇహలోక జీవితంలో శిక్షించదలిచాడు.మరియు అది వారు దాని మార్గములో అనుభవిస్తున్నకష్టాల మరియు విపత్తుల ద్వారా జరుగును.మరియు వారి శరీరముల నుండి వారి ఆత్మలు వీడే సమయములో వారు తమ అవిశ్వాసములో ఉండాలని (కోరుతున్నాడు).
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి