సూరా 9 · జుజ్ 10
At-Tawbah · 9:86
وَإِذَا أُنْزِلَتْ سُورَةٌ أَنْ آمِنُوا بِاللَّهِ وَجَاهِدُوا مَعَ رَسُولِهِ اسْتَأْذَنَكَ أُولُو الطَّوْلِ مِنْهُمْ وَقَالُوا ذَرْنَا نَكُنْ مَعَ الْقَاعِدِينَ
మరియు: "అల్లాహ్ ను విశ్వసించండి. మరియు ఆయన ప్రవక్తతో కలసి (అల్లాహ్ మార్గంలో) పోరాడండి!" అని సూరహ్ అవతరింప జేయబడి నపుడు, వారిలోని ధనవంతులు నీతో: "వెనుక ఉండే వారితో కూర్చోవటానికి మమ్మల్ని విడిచి పెట్టు." అని అనుమతి కోరారు.
తఫ్సీర్
మరియు ఎప్పుడైతే అల్లాహ్ తన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, అల్లాహ్ ను విశ్వశించే మరియు ఆయన మార్గములో ధర్మ పోరాటమునకు సంబంధించి ఏదైన సూరహ్ ను అవతరింపజేసినప్పుడు వారిలోంచి ధనవంతులు,స్థితిమంతులు యుద్ధం నుండి వెనుక ఉండిపోవటం కొరకు మీతో అనుమతిని కోరుతారు.మరియు వారు ఇలా అంటారు : మీరు మమ్మల్ని వదిలివేయండి మేము కారణాలు కలవారైన బలహీనులు,రోగుల తోపాటు యుద్ధము నుండి వెనుక ఉండిపోతాము.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి