సూరా 9 · జుజ్ 10

At-Tawbah · 9:84

وَلَا تُصَلِّ عَلَىٰ أَحَدٍ مِنْهُمْ مَاتَ أَبَدًا وَلَا تَقُمْ عَلَىٰ قَبْرِهِ ۖ إِنَّهُمْ كَفَرُوا بِاللَّهِ وَرَسُولِهِ وَمَاتُوا وَهُمْ فَاسِقُونَ

మరియు వారిలో (కపట విశ్వాసులలో) ఎవరైనా మరణిస్తే, అతడి నమాజే జనాజహ్ కూడా నీవు ఏ మాత్రం చేయకు మరియు అతని గోరీ వద్ద కూడా నిలబడకు, నిశ్చయంగా వారు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించారు. మరియు వారు అవిధేయులు (ఫాసిఖూన్)గా ఉన్న స్థితిలోనే మరణించారు.

తఫ్సీర్

ఓ ప్రవక్తా మీరు కపటుల్లోంచి మరణించిన వారి ఏ జనాజా నమాజును ఏమాత్రం చదివించకండి,మరియు అతని సమాధి వద్ద అతని మన్నింపు వేడుకోవటం కొరకు నిలబడకండి.ఇది ఎందుకంటే వారు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును చూపారు,ఆయన ప్రవక్త పట్ల అవిశ్వాసమును చూపారు.మరియు వారు అల్లాహ్ విధేయత నుండి వైదొలిగి మరణించారు.మరియు ఎవరైతే ఇలా ఉంటాడో అతని జనాజా నమాజు చదివించకూడదు,మరియు అతని కొరకు దుఆ చేయకూడదు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి