సూరా 9 · జుజ్ 10
At-Tawbah · 9:46
۞ وَلَوْ أَرَادُوا الْخُرُوجَ لَأَعَدُّوا لَهُ عُدَّةً وَلَٰكِنْ كَرِهَ اللَّهُ انْبِعَاثَهُمْ فَثَبَّطَهُمْ وَقِيلَ اقْعُدُوا مَعَ الْقَاعِدِينَ
మరియు ఒకవేళ వారు బయలుదేరాలని కోరి ఉంటే తప్పక దానికై వారు యుద్ధ సామగ్రి సిద్ధ పరచుకొని ఉండేవారు, కాని వారు బయలు దేరటం అల్లాహ్ కు ఇష్టం లేదు, కావున వారిని నిలిపివేశాడు. మరియు వారితో: "కూర్చొని ఉన్న వారితో మీరు కూడా కూర్చొని ఉండండి!" అని చెప్పబడింది.
తఫ్సీర్
ఒక వేళ అల్లాహ్ మార్గములో యుద్ధము కొరకు మీతో పాటు బయలుదేరటమును వారు కోరుకుంటున్నారన్న వాదనలో వారు సత్యవంతులైతే దాని కొరకు వారు యుద్ధ సామగ్రిని తయారు చేసుకొని సిద్ధం అయ్యేవారు.కాని అల్లాహ్ మీతో పాటు వారి బయలుదేరటమును ఇష్టపడలేదు.అయితే వారికి బయలుదేరటం బరువైనది చివరికి వారు తమ ఇళ్ళలోనే కూర్చోవటమును ప్రాధాన్యతనిచ్చారు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి