సూరా 9 · జుజ్ 10
At-Tawbah · 9:47
لَوْ خَرَجُوا فِيكُمْ مَا زَادُوكُمْ إِلَّا خَبَالًا وَلَأَوْضَعُوا خِلَالَكُمْ يَبْغُونَكُمُ الْفِتْنَةَ وَفِيكُمْ سَمَّاعُونَ لَهُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ بِالظَّالِمِينَ
ఒకవేళ వారు మీతో కలిసి వెళ్ళినా మీలో కలతలు తప్ప మరేమీ అధికం చేసేవారు కాదు. మరియు మీ మధ్య ఉపద్రవం (ఫిత్న) రేకెత్తించటానికి తీవ్రప్రయత్నాలు చేసేవారు. మరియు మీలో కొందరు వారి కొరకు (కపట విశ్వాసుల కొరకు) మాటలు వినేవారు (వారి గూఢాచారులు) ఉన్నారు. మరియు అల్లాహ్ కు దుర్మార్గుల గురించి బాగా తెలుసు.
తఫ్సీర్
ఈ కపటులందరు మీతో పాటు బయలుదేరకుండా ఉండటంలోనే మేలు ఉన్నది.ఒక వేళ వారు మీతో పాటు బయలుదేరి ఉంటే వారు నిస్సహాయ స్థిలిలో వదిలివేయటం,సందేహాలను కలిగించటం లాంటి కార్యాలను చేసి మీలో కల్లోలాలను అధికం చేస్తారు.మిమ్మల్ని చెల్లాచెదురు చేయటం కొరకు మీ పంక్తుల్లో చాడీలను వేగవంతంగా వ్యాపింపజేస్తారు.ఓ విశ్వాసపరులారా మీలో వారి అబద్దపు ప్రచారాలను విని వాటిని అంగీకరించి వ్యాపింపజేసేవారు ఉన్నారు.తద్వారా మీ మధ్య విభేదాలు తలెత్తుతాయి.మరియు విశ్వాసపరుల మధ్య కుట్రలను,సందేహాలను కలిగించే కపటుల్లోంచి దుర్మార్గుల గురించి అల్లాహ్ కు బాగా తెలుసు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి