సూరా 9 · జుజ్ 10
At-Tawbah · 9:45
إِنَّمَا يَسْتَأْذِنُكَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَارْتَابَتْ قُلُوبُهُمْ فَهُمْ فِي رَيْبِهِمْ يَتَرَدَّدُونَ
నిస్సందేహంగా, అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించని వారే, వెనుక ఉండటానికి అనుమతి అడుగుతారు. మరియు వారి హృదయాలు సందేహంలో మునిగి ఉన్నాయి. కావున వారు తమ సందేహాలలో పడి ఊగిసలాడుతున్నారు.
తఫ్సీర్
ఓ ప్రవక్తా నిశ్చయంగా అల్లాహ్ మార్గములో పోరాటము నుండి వెనుక ఉండే విషయంలో మీతో అనుమతి కోరే వారు అల్లాహ్ పై విశ్వాసమును కనబరచని,ప్రళయ దినముపై విశ్వాసమును కనబరచని కపటులు. అల్లాహ్ ధర్మం విషయంలో వారి మనస్సులకి సందేహము కలిగింది. వారు సత్యం వైపునకు మార్గం పొందకుండా తమ సందేహములో గందరగోళంగా ఊగిసలాడుతున్నారు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి