సూరా 9 · జుజ్ 10

At-Tawbah · 9:44

لَا يَسْتَأْذِنُكَ الَّذِينَ يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ أَنْ يُجَاهِدُوا بِأَمْوَالِهِمْ وَأَنْفُسِهِمْ ۗ وَاللَّهُ عَلِيمٌ بِالْمُتَّقِينَ

అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించేవారు, తమ సంపత్తి మరియు తమ ప్రాణాలను వినియోగించి (అల్లాహ్ మార్గంలో) పోరాడటం నుండి తప్పించుకోవటానికి ఎన్నడూ అనుమతి అడగరు. మరియు దైవభీతి గలవారు ఎవరో అల్లాహ్ కు బాగా తెలుసు.

తఫ్సీర్

ఓ ప్రవక్తా తమ సంపదల ద్వారా,తమ ప్రాణముల ద్వారా అల్లాహ్ మార్గములో పోరాడటం నుండి వెనుక ఉండే విషయంలో మీతో అనుమతిని కోరటం అల్లాహ్ పై,ప్రళయ దినముపై సత్యవిశ్వాసమును కనబరిచే విశ్వాసపరులకు తగదు. కాని మీరు వారిని యుద్ధం కొరకు ఎప్పుడు బయలుదేరమని అడిగితే అప్పుడు బయలుదేరటం,తమ సంపదల ద్వారా,తమ ప్రాణాల ద్వారా పోరాడటం వారికి వర్తిస్తుంది. మీతో పాటు బయలుదేరటం నుండి వారిని ఆపే కారణాలు ఉంటే తప్ప మీతో అనుమతి అడగని దైవభీతి గల తన దాసుల గురించి అల్లాహ్ కి బాగా తెలుసు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి