సూరా 9 · జుజ్ 10
At-Tawbah · 9:19
۞ أَجَعَلْتُمْ سِقَايَةَ الْحَاجِّ وَعِمَارَةَ الْمَسْجِدِ الْحَرَامِ كَمَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَجَاهَدَ فِي سَبِيلِ اللَّهِ ۚ لَا يَسْتَوُونَ عِنْدَ اللَّهِ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
ఏమీ? హజ్జ్ మరియు ఉమ్రా కొరకు వచ్చే వారికి నీరు త్రాపటాన్ని మరియు మస్జిద్ అల్ హరామ్ ను నిర్వహించటాన్ని, మీరు అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించి, అల్లాహ్ మార్గంలో పోరాడేదానికి సమానంగా భావిస్తున్నారా? అల్లాహ్ దగ్గర, వారు (ఈ రెండు పక్షాల వారు) సరిసమానులు కారు. మరియు అల్లాహ్ దుర్మార్గులైన ప్రజలకు సన్మార్గం చూపడు.
తఫ్సీర్
ఓ ముష్రికులారా ఏమీ మీరు హజ్ చేసేవారికి నీటినిత్రాపించే,మస్జిదుల్ హరాం నిర్వహణ బాధ్యతలు నిర్వహించే వారిని అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి, ఆయనతోపాటు ఎవరిని సాటి కల్పించకుండా ఉండి,ప్రళయదినము పై విశ్వాసమును కనబరచి,అల్లాహ్ కలిమానే ఉన్నత స్థానానికి చేరటానికి,అవిశ్వాసపరుల కలిమ క్రిందికి అయిపోవటానికి తన ధన,ప్రాణాల ద్వారా పోరాడిన వారి మాదిరిగా చేస్తారా,ఏమీ మీరు వారందరిని అల్లాహ్ వద్ద అనుగ్రహము పొందే విషయంలో సమానంగా చేస్తారా?వారందరు అల్లాహ్ వద్ద ఎన్నటికి సమానంకారు.మరియు అల్లాహ్ షిర్క్ చేసి దుర్మార్గులైన వారు ఒక వేళ హజ్ చేసేవారికి నీటిని త్రాపించటం లాంటి మంచి కార్యాలు చేసిన సన్మార్గమును పొందే సౌభాగ్యమును కల్పించడు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి