సూరా 9 · జుజ్ 10
At-Tawbah · 9:20
الَّذِينَ آمَنُوا وَهَاجَرُوا وَجَاهَدُوا فِي سَبِيلِ اللَّهِ بِأَمْوَالِهِمْ وَأَنْفُسِهِمْ أَعْظَمُ دَرَجَةً عِنْدَ اللَّهِ ۚ وَأُولَٰئِكَ هُمُ الْفَائِزُونَ
విశ్వసించి, అల్లాహ్ మార్గంలో వలస పోయిన వారికీ మరియు తమ ధనసంపత్తులను, ప్రాణాలను వినియోగించి పోరాడిన వారికీ, అల్లాహ్ దగ్గర అత్యున్నత స్థానముంది. మరియు అలాంటి వారే సాఫల్యం (విజయం) పొందేవారు.
తఫ్సీర్
అల్లాహ్ పై విశ్వాసమునకు,అవిశ్వాస ప్రాంతముల నుండి విశ్వాస ప్రాంతములకు హిజ్రత్ చేయటమునకు (వలస పోవటమునకు),ధన,ప్రాణాల ద్వారా అల్లాహ్ మార్గములో పోరాడటమునకు మధ్య సమీకరించేవారు అల్లాహ్ వద్ద ఇతరుల కన్న ఉన్నత స్థానమును కలవారు.ఈ గుణాలను కలిగిన వారందరు స్వర్గమును పొంది సాఫల్యమును పొందేవారు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి