సూరా 9 · జుజ్ 10
At-Tawbah · 9:18
إِنَّمَا يَعْمُرُ مَسَاجِدَ اللَّهِ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَلَمْ يَخْشَ إِلَّا اللَّهَ ۖ فَعَسَىٰ أُولَٰئِكَ أَنْ يَكُونُوا مِنَ الْمُهْتَدِينَ
నిశ్చయంగా, అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించేవారు, నమాజ్ ను స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడని వారు మాత్రమే అల్లాహ్ మస్జిదులను నిర్వహించాలి. ఇలాంటి వారే మార్గదర్శకత్వం పొందినవారని ఆశించవచ్చు!
తఫ్సీర్
మస్జిదుల నిర్వహణకు హక్కుదారులు,దాని హక్కును నిర్వహించే బాధ్యతను తీసుకునేవారు ఒకే అల్లాహ్ ను విశ్వసిస్తూ,ఆయనతో పాటు ఎవరినీ సాటి కల్పించకుండా ఉంటూ,ప్రళయదినంపై విశ్వాసమును కనబరుస్తూ,నమాజులను నెలకొల్పుతూ.తమ సంపద నుండి జకాతును చెల్లిస్తూ,అల్లాహ్ సుబహానహు వ తఆలాతో తప్ప ఇతరులతో భయపడని వారు మాత్రమే.ఇలాంటి వారందరితో వారు సన్మార్గమును పొందుతారని ఆశించవచ్చు.ముష్రికులు మాత్రం దీని నుండి చాలా దూరంగా ఉంటారు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి