సూరా 9 · జుజ్ 10
At-Tawbah · 9:17
مَا كَانَ لِلْمُشْرِكِينَ أَنْ يَعْمُرُوا مَسَاجِدَ اللَّهِ شَاهِدِينَ عَلَىٰ أَنْفُسِهِمْ بِالْكُفْرِ ۚ أُولَٰئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ وَفِي النَّارِ هُمْ خَالِدُونَ
బహుదైవారాధకులు (ముష్రికీన్), తాము సత్యతిరస్కారులమని సాక్ష్యమిస్తూ, అల్లాహ్ మస్జిదులను నిర్వహించటానికి (సేవ చేయటానికి) అర్హులు కారు. అలాంటి వారి కర్మలు వ్యర్థమై పోతాయి మరియు వారు నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటారు.
తఫ్సీర్
ముష్రికులు తమ ద్వారా బహిర్గతం అవుతున్న వాటి ద్వారా స్వయంగా అవిశ్వాసమును అంగీకరిస్తూ ఆరాధనల ద్వారా,విధేయత కార్యాల ద్వారా అల్లాహ్ మస్జిదులను నిర్వహించటం వారికి సరికాదు.వారందరి ఆచరణలు అవి స్వీకరించబడటానికి కావలసిన షరతు అయిన విశ్వాసమును కోల్పోవటం వలన వృధా అయిపోయినవి.మరియు వారందరు ప్రళయ దినాన నరకములో శాస్వతంగా ఉండేటట్లు ప్రవేసిస్తారు.కాని ఒక వేళ వారు వారి మరణం ముందు షిర్కు నుండి తౌబా చేసుకుంటే (విముక్తి పొందుతారు).
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి