సూరా 9 · జుజ్ 10

At-Tawbah · 9:16

أَمْ حَسِبْتُمْ أَنْ تُتْرَكُوا وَلَمَّا يَعْلَمِ اللَّهُ الَّذِينَ جَاهَدُوا مِنْكُمْ وَلَمْ يَتَّخِذُوا مِنْ دُونِ اللَّهِ وَلَا رَسُولِهِ وَلَا الْمُؤْمِنِينَ وَلِيجَةً ۚ وَاللَّهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ

ఏమీ? అల్లాహ్ మీలో నుండి (తన మార్గంలో) పోరాడేవారెవరో మరియు - అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు తప్ప - ఇతరుల నెవ్వరినీ తమ ఆప్తమిత్రులుగా చేసుకోని వారెవరో, తెలుసుకోనిదే మిమ్మల్ని వదలిపెడతాడని అనుకుంటున్నారా? మరియు అల్లాహ్ మీరు చేస్తున్నదంతా బాగా ఎరుగును.

తఫ్సీర్

ఓ విశ్వాసపరులారా అల్లాహ్ మిమ్మల్ని పరీక్షించకుండా వదిలివేస్తాడని అనుకుంటున్నారా ?.పరీక్ష అన్నది ఆయన సాంప్రదాయాల్లోంచి ఒక సాంప్రదాయము.మీలో నుంచి చిత్తశుధ్ధితో అల్లాహ్ కొరకు పోరాడే దాసులను స్పష్టమైన జ్ఞానంతో అల్లాహ్ తెలుసుకునేంత వరకు మీరు పరీక్షించబడుతారు.వారందరు అల్లాహ్ ను కాక,ఆయన ప్రవక్తను కాక,విశ్వాసపరులను కాక తమతో స్నేహం చేసే అవిశ్వాసపరులను ఆప్త మితృలుగా చేసుకోరు.మరియు అల్లాహ్ మీరు చేసే కార్యాలను తెలుసుకునేవాడు.వాటిలోంచి ఏది కూడా ఆయనపై గోప్యంగా ఉండదు.మరియు త్వరలోనే ఆయవ వాటిపరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి