సూరా 9 · జుజ్ 11
At-Tawbah · 9:128
لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِنْ أَنْفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُمْ بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَحِيمٌ
(ఓ ప్రజలారా!) వాస్తవానికి, మీ వద్దకు మీలో నుంచే ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి ఉన్నాడు; మీరు ఆపదకు గురి కావటం అతనికి కష్టం కలిగిస్తుంది; అతను మీ మేలు కోరేవాడు, విశ్వాసుల ఎడల కనికరుడు, కరుణామయుడు.
తఫ్సీర్
ఓ అరబ్ వాసులారా నిశ్చయంగా మీ కోవకు చెందినవాడే మీ వద్దకు ప్రవక్తగా వచ్చాడు అతను మీలాగే అరబ్బుడు.మీకు బాధ కలిగించేవి ఆయనకు బాధ కలిగించాయి.అతను మీ సన్మార్గము విషయంలో,మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటంలో అతని కోరిక తీవ్రమైనది.మరియు అతడు ప్రత్యేకంగా విశ్వాసపరులపై అధికముగా దయచూపేవాడు,కరుణించేవాడు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి