సూరా 9 · జుజ్ 11

At-Tawbah · 9:127

وَإِذَا مَا أُنْزِلَتْ سُورَةٌ نَظَرَ بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ هَلْ يَرَاكُمْ مِنْ أَحَدٍ ثُمَّ انْصَرَفُوا ۚ صَرَفَ اللَّهُ قُلُوبَهُمْ بِأَنَّهُمْ قَوْمٌ لَا يَفْقَهُونَ

మరియు ఏదైనా సూరహ్ అవతరించినపుడల్లా వారు ఒకరినొకరు చూసుకుంటూ (అంటారు): "ఎవడైనా మిమ్మల్ని చూస్తున్నాడా?" ఆ తరువాత అక్కడి నుండి మెల్లగా జారుకుంటారు. అల్లాహ్ వారి హృదయాలను (సన్మార్గం నుండి) మళ్ళించాడు. ఎందుకంటే నిశ్చయంగా, వారు అర్థం చేసుకోలేని జనులు.

తఫ్సీర్

అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఏదైన సూరాను అవతరింపజేసినప్పుడు అందులో కపటవిశ్వాసుల పరిస్థితుల ప్రస్తావన ఉంటే కపటవిశ్వాసులు మిమ్మల్ని ఎవరైన చూశారా ? అని పలుకుతూ ఒకరినొకరు చూసుకుంటారు ఒక వేళ వారిని ఎవరూ చూడకపోతే వారు సభ నుండి మరలిపోతారు (నెమ్మదిగా జారుకుంటారు).వినండి అల్లాహ్ వారి హృదయాలను సన్మార్గము నుండి,మంచి నుండి మరల్చేశాడు.మరియు వారికి పరాభవమునకు లోను చేశాడు.ఎందుకంటే వారు అర్ధం చేసుకోలేని మనుషులు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి