సూరా 9 · జుజ్ 11
Allah is sufficient for me · At-Tawbah 9:129
فَإِنْ تَوَلَّوْا فَقُلْ حَسْبِيَ اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ عَلَيْهِ تَوَكَّلْتُ ۖ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ
అయినా వారు విముఖులైతే, వారితో అను: "నాకు అల్లాహ్ చాలు! ఆయన తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు! నేను ఆయననే నమ్ముకున్నాను. మరియు ఆయనే సర్వోత్తమ సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు."
తఫ్సీర్
అయితే ఒక వేళ వారు మీ నుండి విముఖత చూపి మీరు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించకపోతే ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : నాకు ఆ అల్లాహ్ చాలు ఎ అల్లాహ్ తప్ప సత్యఆరాధ్య దైవము లేడో. ఆయన ఒక్కడి పైనే నేను నమ్మకమును కలిగి ఉన్నాను.పరిశుద్ధుడైన ఆయన సర్వోత్తమ సింహాసనానికి ప్రభువు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి