సూరా 7 · జుజ్ 8

Al-A'raf · 7:50

وَنَادَىٰ أَصْحَابُ النَّارِ أَصْحَابَ الْجَنَّةِ أَنْ أَفِيضُوا عَلَيْنَا مِنَ الْمَاءِ أَوْ مِمَّا رَزَقَكُمُ اللَّهُ ۚ قَالُوا إِنَّ اللَّهَ حَرَّمَهُمَا عَلَى الْكَافِرِينَ

మరియు నరకవాసులు స్వర్గవాసులతో: "కొద్ది నీళ్ళో లేక అల్లాహ్ మీకు ప్రసాదించిన ఆహారంలో నుండైనా కొంత మా వైపుకు విసరండి." అని అంటారు. (దానికి స్వర్గవాసులు): "నిశ్చయంగా అల్లాహ్! ఈ రెండింటినీ సత్యతిరస్కారులకు నిషేధించి వున్నాడు." అని అంటారు.

తఫ్సీర్

నరక వాసులు స్వర్గ వాసులను వేడుకుంటూ ఇలా పలుకుతారు : ఓ స్వర్గ వాసులారా మాపై నీళ్ళను పోయండి లేదా మీకు అల్లాహ్ ప్రసాదించిన ఆహారములోంచి కొద్దిగా ఇటు మా వైపు పడవేయండి. స్వర్గ వాసులు సమాధానమిస్తూ ఇలా అంటారు : నిశ్చయంగా అల్లాహ్ ఆ రెండింటిని సత్య తిరస్కారులపై వారి అవిశ్వాసం వలన నిషేదించాడు. మరియు అల్లాహ్ మీపై నిషేదించిన వాటి విషయంలో మేము ఏమాత్రం మీకు సహాయం చేయలేము.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి