సూరా 7 · జుజ్ 8

Al-A'raf · 7:51

الَّذِينَ اتَّخَذُوا دِينَهُمْ لَهْوًا وَلَعِبًا وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا ۚ فَالْيَوْمَ نَنْسَاهُمْ كَمَا نَسُوا لِقَاءَ يَوْمِهِمْ هَٰذَا وَمَا كَانُوا بِآيَاتِنَا يَجْحَدُونَ

వీరే, వారు; ఎవరైతే తమ ధర్మాన్ని ఒక ఆటగా మరియు కాలక్షేపంగా చేసుకున్నారో. మరియు ఇహలోక జీవితం వారిని మోసానికి గురి చేసింది. (అల్లాహ్ ఇలా సెలవిస్తాడు): "వారు ఈనాటి సమావేశాన్ని మరచి, మా సూచనలను తిరస్కరించినట్లు, ఈనాడు మేమూ వారిని మరచిపోతాము!"

తఫ్సీర్

ఈ అవిశ్వాసపరులందరు తమ ధర్మమును హాస్యాస్పదంగా,వ్యర్దంగా చేసుకున్నారు. ఇహలోక జీవితం తన అందం,అలంకరణ ద్వారా వారిని మోసగించింది. ప్రళయదినాన అల్లాహ్ వారిని మరచిపోతాడు,వారిని శిక్షను అనుభవిస్తూ ఉండేటట్లు వదిలి వేస్తాడు. వారు ప్రళయ దినం కోసం అమలు చేయకుండా,దాని కోసం సిద్ధం కాకుండా దానిని మరచిపోయినట్లు,అల్లాహ్ వాదనలు,ఆధారాలు సత్యం అని తెలిసి కూడా వాటిని విస్మరించినట్లు,నిరాకరించినట్లు (అల్లాహ్ వారిని మరచి పోతాడు).

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి