సూరా 7 · జుజ్ 9
Al-A'raf · 7:167
وَإِذْ تَأَذَّنَ رَبُّكَ لَيَبْعَثَنَّ عَلَيْهِمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ مَنْ يَسُومُهُمْ سُوءَ الْعَذَابِ ۗ إِنَّ رَبَّكَ لَسَرِيعُ الْعِقَابِ ۖ وَإِنَّهُ لَغَفُورٌ رَحِيمٌ
మరియు నీ ప్రభువు వారిపై (యూదులపై) అంతిమదినం వరకు దుఃఖకరమైన శిక్ష విధించే వారిని పంపుతూ ఉంటానని ప్రకటించిన విషయాన్ని (జ్ఞప్తికి తెచ్చుకోండి). నిశ్చయంగా, నీ ప్రభువు శిక్ష విధించటంలో శీఘ్రుడు, మరియు నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.
తఫ్సీర్
ఓ ప్రవక్తా యూదులపై వారి ఇహలోక జీవితంలో ప్రళయదినం వరకు వారిని అవమానానికి గురి చేసే వారిని,పరాభవమునకు గురి చేసే వారిని అంటగడతాడని అల్లాహ్ ఎటువంటి సందేహం లేని స్పష్టంగా చేసిన ప్రకటన చేసినప్పటి వైనమును గుర్తు చేసుకోండి. ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు తనపై అవిధేయత చూపే వారిని శీఘ్రంగా శిక్షిస్తాడు. చివరికి ఆయన ఇహలోకంలోనే అతనిని శిక్షించటంలో తొందర చేస్తాడు. తన దాసుల్లోంచి అతనితో పాపముల మన్నింపు వేడుకునే వారిని క్షమించే వాడును,వారిపై అపారంగా కరుణించే వాడును.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి