సూరా 7 · జుజ్ 9

Al-A'raf · 7:168

وَقَطَّعْنَاهُمْ فِي الْأَرْضِ أُمَمًا ۖ مِنْهُمُ الصَّالِحُونَ وَمِنْهُمْ دُونَ ذَٰلِكَ ۖ وَبَلَوْنَاهُمْ بِالْحَسَنَاتِ وَالسَّيِّئَاتِ لَعَلَّهُمْ يَرْجِعُونَ

మరియు మేము వారిని భువిలో వేర్వేరు తెగలుగా జేసి వ్యాపింప జేశాము. వారిలో కొందరు సన్మార్గులున్నారు, మరి కొందరు దానికి దూరమైన వారున్నారు. బహుశా వారు (సన్మార్గానికి) మరలి వస్తారేమోనని, మేము వారిని మంచి-చెడు స్థితుల ద్వారా పరీక్షించాము.

తఫ్సీర్

మరియు మేము వారిని భూమండలంలో (తెగలుగా,వర్గాలుగా) విభజించాము,అందులో వారు కలిసి ఉన్నప్పటికీ మేము వారిని అనేక వర్గాలుగా చీల్చి వేశాము. వారిలోంచి కొందరు అల్లాహ్ యొక్క హక్కులను,ఆయన దాసుల యొక్క హక్కులను నిర్వర్తించే సజ్జనులు ఉన్నారు. వారిలోంచి మధ్యే మార్గమును అనుసరించే వారు ఉన్నారు. వారిలోంచి అవిధేయ కార్యాల వలన (పాప కార్యాల వలన) తమపై అన్యాయము చేసుకునే వారు ఉన్నారు. మరియు మేము వారిని సౌలభ్యము ద్వారా కష్టతరము ద్వారా వారు ఉన్న స్థితి నుండి మరలుతారని ఆశిస్తూ పరీక్షించినాము.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి