సూరా 7 · జుజ్ 9

Al-A'raf · 7:166

فَلَمَّا عَتَوْا عَنْ مَا نُهُوا عَنْهُ قُلْنَا لَهُمْ كُونُوا قِرَدَةً خَاسِئِينَ

కాని నిషేధించబడిన వాటినే వారు హద్దులు మీరి చేసినప్పుడు మేము వారితో: "మీరు నీచమైన కోతులుగా మారండి." అని అన్నాము.

తఫ్సీర్

మరియు ఎప్పుడైతే వారు గర్వంగా,మొండిగా అల్లాహ్ కు అవిధేయతలో హద్దుమీరి పోయారో, హితోపదేశమును గ్రహించలేదో వారితో మేము ఇలా అన్నాము : "ఓ అవిధేయులారా మీరు నీచమైన కోతులుగా మారిపోండి". అప్పుడు వారు మేము కోరిన విధంగా అయిపోయారు. మేము ఏదైన వస్తువును తలచుకుంటే మా ఆదేశం ఇలా ఉంటుంది. మేము దానితో అంటాము "నీవు అయిపో" అది అయిపోతుంది.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి