సూరా 6 · జుజ్ 7
Al-An'am · 6:32
وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا لَعِبٌ وَلَهْوٌ ۖ وَلَلدَّارُ الْآخِرَةُ خَيْرٌ لِلَّذِينَ يَتَّقُونَ ۗ أَفَلَا تَعْقِلُونَ
మరియు ఇహలోక జీవితం ఒక ఆట మరియు ఒక కాలక్షేపము మాత్రమే! మరియు దైవభీతి గల వారికి పరలోక వాసమే అత్యంత శ్రేష్ఠమైనది. ఏమీ? మీరు అర్థం చేసుకోలేరా?
తఫ్సీర్
ఇహలోక జీవితం దేని వైపునైతే మీరు వాలుతున్నారో అందులో అల్లాహ్ ను ప్రసన్నం చేసే కార్యాలు చేయని వారి కొరకు అది ఒక ఆటవిడుపు,మోసపూరితమైన సామగ్రి అవుతుంది.పరలోక వాసము అల్లాహ్ కు భయపడుతూ విశ్వాసం,విధేయత గురించి ఆయన ఇచ్చిన ఆదేశాలను పాటించేవారి కొరకు,షిర్క్,అవిధేయత నుండి దేనినైతే ఆయన వారంచాడో వాటిని వదిలివేసే వారి కొరకు ఎంతో శ్రేయస్కరమైనది.ఓ ముష్రికులారా మీరు మీరు దీనిని అర్ధం చేసుకోరా? .అయితే మీరు విశ్వసించండి,సత్కార్యాలు చేయండి.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి