సూరా 6 · జుజ్ 7
Al-An'am · 6:31
قَدْ خَسِرَ الَّذِينَ كَذَّبُوا بِلِقَاءِ اللَّهِ ۖ حَتَّىٰ إِذَا جَاءَتْهُمُ السَّاعَةُ بَغْتَةً قَالُوا يَا حَسْرَتَنَا عَلَىٰ مَا فَرَّطْنَا فِيهَا وَهُمْ يَحْمِلُونَ أَوْزَارَهُمْ عَلَىٰ ظُهُورِهِمْ ۚ أَلَا سَاءَ مَا يَزِرُونَ
వాస్తవంగా అల్లాహ్ ను కలుసుకోవటాన్ని అబద్ధంగా పరిగణించే వారే నష్టానికి గురి అయిన వారు! చివరకు ఆకస్మాత్తుగా అంతి ఘడియ వారి పైకి వచ్చినపుడు వారు: "అయ్యే మా దౌర్భాగ్యం! దీని విషయంలో మేమెంత అశ్రద్ధ వహించాము కదా! అని వాపోతారు. (ఎందుకంటే) వారు తమ (పాపాల) బరువును తమ వీపులపై మోసుకొని ఉంటారు. అయ్యే! వారు మోసే భారం ఎంత దుర్భరమైనది కదా!
తఫ్సీర్
మరణాంతర జీవితాన్ని తిరస్కరించేవారు,అల్లాహ్ ముందట నిలబడటంను దూరంగా భావించేవారు ప్రళయదినమున నష్టమును చవిచూస్తారు.చివరికి ముందస్తు జ్ఞానం లేకుండా అకస్మాత్తుగా వారివద్ద ప్రళయం వచ్చిపడినప్పుడు వారు తీవ్ర అవమానముతో క్రుంగిపోతు ఇలా అంటారు:మేము అల్లాహ్ విషయంలో అవిశ్వాసమును చూపి,ప్రళయదినం కొరకు సిద్ధం కాకుండా ఉండి మేము అశ్రద్ధత వహించటం వలన అయ్యో మనకు భాధ కలిగినదే,మన ఆశలపై నీరు కారిపోయినదే.వారు తమ పాపముల బరువును తమ వీపులపై మోస్తూ ఉంటారు.వినండి వారు మోస్తున్న ఈ పాపముల బరువు చాలా చెడ్డదైనది.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి