సూరా 6 · జుజ్ 7

Al-An'am · 6:33

قَدْ نَعْلَمُ إِنَّهُ لَيَحْزُنُكَ الَّذِي يَقُولُونَ ۖ فَإِنَّهُمْ لَا يُكَذِّبُونَكَ وَلَٰكِنَّ الظَّالِمِينَ بِآيَاتِ اللَّهِ يَجْحَدُونَ

(ఓ ప్రవక్తా!) వాస్తవానికి వారు పలుకుతున్న మాటల వలన నీకు దుఃఖము కలుగుతున్నదని మాకు బాగా తెలుసు. కానీ, నిశ్చయంగా, వారు అసత్యుడవని తిరస్కరించేది నిన్ను కాదు! వాస్తవానికి ఆ దుర్మార్గులు అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) తిరస్కరిస్తున్నారు.

తఫ్సీర్

ఓ ప్రవక్త వారు బహిర్గంగా మిమ్మల్ని తిరస్కరించటం మీకు బాధ కలిగిస్తుందని మాకు తెలుసు.మీ యొక్క నీతి,నిజాయితి వలన వారు తమ మనస్సులలో మిమ్మల్ని తిరస్కరించటం లేదన్న విషయాన్ని మీరు గుర్తించుకోండి.కాని వారు బహిర్గంగా మీ విషయాన్ని తిరస్కరిస్తూ తమ మనసుల్లో దాని గురించి నమ్మకంను కలిగి ఉన్న దుర్మార్గులు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి