సూరా 5 · జుజ్ 6
Al-Ma'idah · 5:47
وَلْيَحْكُمْ أَهْلُ الْإِنْجِيلِ بِمَا أَنْزَلَ اللَّهُ فِيهِ ۚ وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ
మరియు ఇంజీల్ గ్రంథ ప్రజలను, అల్లాహ్! ఆ గ్రంథంలో అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చేయమను. మరియు ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చేయరో అలాంటి వారు, వారే అవిధేయులు (దుష్టులు).
తఫ్సీర్
మరియు క్రైస్తవులు ఇంజీలులో అల్లాహ్ అవతరింపజేసిన దాన్ని విశ్వసించాలి మరియు వారి వద్దకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపబడక మునుపు వారు అందులో వచ్చిన నిజాల వాటి విషయంలో దాని ప్రకారమే తీర్పునివ్వాలి. మరియు ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన వాటి ప్రకారంగా తీర్పునివ్వరో వారందరు అల్లాహ్ విధేయత నుండి వైదొలగినవారు మరియు సత్యమును విడిచినవారు,అసత్యము వైపునకు వాలినవారు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి