సూరా 5 · జుజ్ 6
Al-Ma'idah · 5:46
وَقَفَّيْنَا عَلَىٰ آثَارِهِمْ بِعِيسَى ابْنِ مَرْيَمَ مُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرَاةِ ۖ وَآتَيْنَاهُ الْإِنْجِيلَ فِيهِ هُدًى وَنُورٌ وَمُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرَاةِ وَهُدًى وَمَوْعِظَةً لِلْمُتَّقِينَ
మరియు మేము వారి (ఆ ప్రవక్తల) అడుగు జాడలను (ఆసారిహిమ్) అనుసరించేవాడు మరియు తౌరాత్ లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరచే వాడయిన, మర్యమ్ కుమారుడు ఈసా (ఏసును) పంపాము. మేము అతనికి ఇంజీల్ గ్రంథాన్ని ప్రసాదించాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి మరియు అది తౌరాత్ లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవీకరిస్తుంది మరియు దైవభీతి గల వారికి మార్గదర్శకత్వం మరియు హితోపదేశం కూడా!
తఫ్సీర్
మరియు మేము మర్యమ్ కుమారుడగు ఈసా అలైహిస్సలాంను తౌరాత్ లో ఉన్న వాటిని విశ్వసించే వాడిగా మరియు వాటి ప్రకారం తీర్పునిచ్చేవాడిగా బనీ ఇస్రాయీలు ప్రవక్తల అడుగుజాడల్లో నడిపించాము. మరియు మేము అతనికి సత్యమునకు మార్గదర్శకం చేయటమును మరియు సందేహాలు కలిగిన వాదనలను తొలగించటమును కలిగిన ఇంజీలును ప్రసాదించాము. మరియు అది తీర్పుల (ఆదేశముల) సమస్యలను పరిష్కరిస్తుంది. మరియు దాని కన్న ముందు అవతరింపబడిన తౌరాత్ కు అనుగుణంగా ఉండేటట్లుగా దాని నిబందనల్లో రద్దుచేయబడ్డ కొన్ని తప్ప. మరియు మేము ఇంజీలును మార్గదర్శకం పొందే విధంగా మార్గదర్శకంగా మరియు ఆయన నిషేదించిన వాటిని పాల్పడటం నుండి వారిని మందలించేదానిగా చేశాము.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి