సూరా 5 · జుజ్ 6
Al-Ma'idah · 5:48
وَأَنْزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيْهِ مِنَ الْكِتَابِ وَمُهَيْمِنًا عَلَيْهِ ۖ فَاحْكُمْ بَيْنَهُمْ بِمَا أَنْزَلَ اللَّهُ ۖ وَلَا تَتَّبِعْ أَهْوَاءَهُمْ عَمَّا جَاءَكَ مِنَ الْحَقِّ ۚ لِكُلٍّ جَعَلْنَا مِنْكُمْ شِرْعَةً وَمِنْهَاجًا ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَجَعَلَكُمْ أُمَّةً وَاحِدَةً وَلَٰكِنْ لِيَبْلُوَكُمْ فِي مَا آتَاكُمْ ۖ فَاسْتَبِقُوا الْخَيْرَاتِ ۚ إِلَى اللَّهِ مَرْجِعُكُمْ جَمِيعًا فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ فِيهِ تَخْتَلِفُونَ
మరియు (ఓ ప్రవక్తా!) మేము ఈ గ్రంథాన్ని నీపై సత్యంతో అవతరింపజేశాము. ఇది పూర్వ గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరుస్తుంది. మరియు వాటిలో ఉన్న సత్యాసత్యాలను పరిష్కరిస్తుంది. కావున నీవు, అల్లాహ్ అవతరింపజేసిన ఈ శాసనం ప్రకారం వారి మధ్య తీర్పు చెయ్యి. మరియు నీ వద్దకు వచ్చిన సత్యాన్ని విడిచి వారి కోరికలను అనుసరించకు. మీలో ప్రతి ఒక్క సంఘానికి ఒక ధర్మశాసనాన్ని మరియు ఒక జీవన మార్గాన్ని నియమించి ఉన్నాము. ఒకవేళ అల్లాహ్ తలుచుకుంటే, మిమ్మల్ని అంతా ఒకే ఒక సంఘంగా రూపొందించి ఉండేవాడు. కాని మీకు ఇచ్చిన దానితో (ధర్మంతో) మిమ్మల్ని పరీక్షించటానికి (ఇలా చేశాడు). కావున మీరు మంచి పనులు చేయటంలో ఒకరితో నొకరు పోటీ పడండి. అల్లాహ్ వద్దకే మీరందరూ మరలిపోవలసి వుంది. అప్పుడు ఆయన మీకున్న భేదాభిప్రాయాలను గురించి మీకు తెలియజేస్తాడు.
తఫ్సీర్
ఓ ప్రవక్తా మేము మీ వైపునకు ఖుర్ఆన్ ను అది అల్లాహ్ వద్ద నుండి కావటంలో ఎటువంటి సందేహము కాని సంశయం కాని లేని సత్యముతో అవతరింపజేశాము. అది తనకు పూర్వం అవతరింపబడిన గ్రంధములను దృవీకరిస్తుంది. వాటిని పరిరక్షిస్తుంది. అది వాటిలో నుండి దేనికి అనుగుణంగా ఉన్నదో అది సత్యము. మరియు అది దేనికి భిన్నంగా ఉన్నదో అది అసత్యము. కావున మీరు అల్లాహ్ మీపై అందులో ఏది అవతరింపజేశాడో దానితో ప్రజల మధ్య తీర్పునివ్వండి. మరియు ఎటువంటి సందేహం లేని మీపై అవతరింపబడిన సత్యమును వదిలివేస్తూ వారు ఎంచుకున్నటువంటి వారి మనోవాంఛలను అనుసరించకండి. మరియు మేము ప్రతీ సమాజం కొరకు ఆచరణాత్మక తీర్పులు కల ధర్మాన్ని మరియు మార్గదర్శకం పొందే స్పష్టమైన మార్గమును చేశాము. మరియు ఒక వేళ అల్లాహ్ ధర్మాలన్నింటిని ఒకే ధర్మంగా చేయదలచుకుంటే చేసేవాడు. కాని ఆయన ప్రతీ సమాజం కొరకు ఒక ధర్మాన్ని చేశాడు. ఆయన అందరిని పరీక్షించటానికి .అప్పుడు అవిధేయుడి నుండి విధేయుడు స్పష్టమవుతాడు. కావున మీరు సత్కర్మలు చేయటానికి మరియు చెడులను విడనాడటానికి త్వరపడండి. ప్రళయదినమున మీ మరలటం అన్నది ఒక్కడైన అల్లాహ్ వైపే జరుగును. మరియు ఏ విషయంలో నైతే విబేధించుకుంటున్నారో దాని గురించి ఆయన మీకు తొందరలోనే తెలియపరుస్తాడు. మరియు తొందరలోనే ఆయన మీరు ముందు పంపించుకున్న కర్మలకు మీకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి