సూరా 4 · జుజ్ 5
An-Nisa · 4:48
إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَنْ يَشَاءُ ۚ وَمَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدِ افْتَرَىٰ إِثْمًا عَظِيمًا
నిశ్చయంగా, అల్లాహ్ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించడు. మరియు అది తప్ప దేనిని (ఏ పాపాన్ని) అయినా, ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ కు భాగస్వాములను కల్పించినవాడే, వాస్తవానికి మహాపాపం చేసిన వాడు!
తఫ్సీర్
నిశ్ఛయంగా అల్లాహ్ తన సృష్టితాల్లోంచి దేనిని తనకు సాటి కల్పించటంను క్షమించడు. మరియు ఆయన పాప కార్యముల్లోంచి సాటి కల్పించటం,అవిశ్వాసం చూపటం కాకుండా ఇతర వాటిని తాను తలచిన వారి కొరకు తన అనుగ్రహం ద్వారా మన్నించివేస్తాడు లేదా వారిలో నుండి తాను తలచిన వారిని వారి పాపములను బట్టి తన న్యాయము ద్వారా వాటి వలన శిక్షిస్తాడు. మరియు ఎవరైతే అల్లాహ్ తో పాటు ఇతరులను సాటి కల్పిస్తాడో అతడు పెద్ద పాపమును కల్పించుకున్నాడు దానిపై మరణించిన వాడు మన్నించబడడు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి