సూరా 4 · జుజ్ 5

An-Nisa · 4:47

يَا أَيُّهَا الَّذِينَ أُوتُوا الْكِتَابَ آمِنُوا بِمَا نَزَّلْنَا مُصَدِّقًا لِمَا مَعَكُمْ مِنْ قَبْلِ أَنْ نَطْمِسَ وُجُوهًا فَنَرُدَّهَا عَلَىٰ أَدْبَارِهَا أَوْ نَلْعَنَهُمْ كَمَا لَعَنَّا أَصْحَابَ السَّبْتِ ۚ وَكَانَ أَمْرُ اللَّهِ مَفْعُولًا

ఓ గ్రంథ ప్రజలారా! మీ వద్ద ఉన్న గ్రంథాన్ని ధృవపరుస్తూ, మేము అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించండి, మేము మీ ముఖాలను వికృతం చేసి వాటిని వెనక్కి త్రిప్పక ముందే (నాశనం చేయక ముందే). లేక మేము సబ్త్ వారిని శపించినట్లుగా (బహిష్కరించినట్లుగా) మిమ్మల్ని కూడా శపించక (బహిష్కరించక) ముందే (దీనిని విశ్వసించండి). ఎందుకంటే! అల్లాహ్ ఆజ్ఞ తప్పకుండా నిర్వహించబడుతుంది.

తఫ్సీర్

ఓ యూదుల్లోంచి మరియు క్రైస్తవుల్లోంచి గ్రంధం ఒసగబడినవారా మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేసిన దాన్ని,మీతో పాటు ఉన్న తౌరాత్ ను దృవీకరిస్తూ వచ్చిన దాన్ని విశ్వసించండి. మేము ముఖముల్లో ఉన్న ఇంద్రియాలను చెరిపివేసి వాటిని వారి వెనుక భాగంలో పడవేయక ముందు లేదా వేటాడే విషయంలో వారిని దాని నుండి ఆపిన తరువాత కూడా మితిమీరిన శనివారం వారిని మేము కారుణ్యం నుండి గెంటివేసిన విధంగా అల్లాహ్ కారుణ్యం నుండి మేము గెంటి వేయక ముందు. అప్పుడు అల్లాహ్ వారిని కోతుల రూపంలో మార్చి వేశాడు. మరియు మహోన్నతుడైన ఆయన ఆదేశము,ఆయన విధివ్రాత ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి