సూరా 4 · జుజ్ 5
An-Nisa · 4:49
أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يُزَكُّونَ أَنْفُسَهُمْ ۚ بَلِ اللَّهُ يُزَكِّي مَنْ يَشَاءُ وَلَا يُظْلَمُونَ فَتِيلًا
ఏమీ? తమను తాము పవిత్రులమని చెప్పుకునేవారిని (యూదులు మరియు క్రైస్తవులను) గురించి నీకు తెలియదా (చూడలేదా)? వాస్తవానికి, అల్లాహ్ తాను కోరిన వారికి మాత్రమే పవిత్రతను ప్రసాదిస్తాడు. మరియు వారికి ఖర్జూర బీజపు చీలికలోని పొర అంత అన్యాయం కూడా చేయబడదు.
తఫ్సీర్
ఓ ప్రవక్త ఏమీ తమను,తమ కర్మలను పవిత్రులమని కీర్తించుకునే వారి విషయం మీకు తెలియదా ?. కాని ఒక్కడైన అల్లాహ్ యే తన దాసుల్లోంచి తాను తలచుకున్న వారిని కీర్తిస్తాడు మరియు వారిని పరిశుద్ధపరుస్తాడు. ఎందుకంటే ఆయనకు హృదయాల అంతర్గతాలు తెలుసు. మరియు ఆయన వారి కర్మల పుణ్యములో నుంచి కొంచము కూడా తగ్గించడు ఒక వేళ అది కర్జురపు టెంకపై ఉన్న పొర పరిమాణంలో ఉన్నా సరే.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి