సూరా 2 · జుజ్ 1
Al-Baqarah · 2:131
إِذْ قَالَ لَهُ رَبُّهُ أَسْلِمْ ۖ قَالَ أَسْلَمْتُ لِرَبِّ الْعَالَمِينَ
అతని ప్రభువు అతనితో: "(మాకు) విధేయుడవుగా (ముస్లింగా) ఉండు." అని అన్నప్పుడు అతను: " నేను సర్వలోకాల ప్రభువునకు విధేయుడను (ముస్లింను) అయిపోయాను." అని జవాబిచ్చాడు.
తఫ్సీర్
ఆయన (ఇబ్రాహీము) ఇస్లాం వైపునకు ముందడుగువేయుట వలన అల్లాహ్ ఆయనను ఎన్నుకున్నాడు.అప్పుడు ఆయనతో ఆయన ప్రభువు ఇలా పలికాడు : నీవు నాకొరకు ఆరాధనను ప్రత్యేకించు,విధేయత ద్వారా నా కొరకు అణుకువనుచూపు,అప్పుడు ఆయన తన ప్రభువుకు సమాధానమిస్తు ఇలా పలికారు : నేను దాసుల సృష్టికర్త,వారి ఉపాది ప్రధాత మరియు వారి వ్యవహారాల నిర్వాహకుడైన అల్లాహ్ కు విధేయుడైనాను.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి