సూరా 2 · జుజ్ 1

Al-Baqarah · 2:132

وَوَصَّىٰ بِهَا إِبْرَاهِيمُ بَنِيهِ وَيَعْقُوبُ يَا بَنِيَّ إِنَّ اللَّهَ اصْطَفَىٰ لَكُمُ الدِّينَ فَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ

మరియు ఇబ్రాహీమ్ తన సంతానాన్ని దీనిలోనే (ఈ ఇస్లాం మార్గంలోనే) నడవండని బోధించాడు. మరియు యఅఖూబ్ కూడా (తన సంతానంతో అన్నాడు): " నా బిడ్డలారా! నిశ్చయంగా, అల్లాహ్ మీ కొరకు ఈ ధర్మాన్నే నియమించి ఉన్నాడు. కావున మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) కాకుండా మరణించకండి.

తఫ్సీర్

మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారులను ఈ వచనమునే ఉపదేసించారు : {سْلَمْتُ لِرَبِّ الْعَالَمِينَ అస్లమ్తు లిరబ్బిల్ ఆలమీన్} అదే విధంగా దానిని యాఖూబు తన కుమారులకు కూడా ఉపదేసించారు.వారిరువురు తమ కుమారులను పిలుస్తూ ఇలా పలికారు : నిశ్చయంగా అల్లాహ్ ఇస్లాం ధర్మమును మీ కొరకు ఆమోదించాడు,ఐతే మీరు మీకు మరణం వచ్చేంత వరకు దానిపై (ఇస్లాంని) స్థిరంగా ఉండండి, మీరు బహిరంగంగా,అంతర్గతంగా అల్లాహ్ కు విధేయులై ఉండండి.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి