సూరా 2 · జుజ్ 1

Al-Baqarah · 2:130

وَمَنْ يَرْغَبُ عَنْ مِلَّةِ إِبْرَاهِيمَ إِلَّا مَنْ سَفِهَ نَفْسَهُ ۚ وَلَقَدِ اصْطَفَيْنَاهُ فِي الدُّنْيَا ۖ وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ

మరియు ఇబ్రాహీమ్ మతం నుండి విముఖుడయ్యేవాడెవడు, తనను తాను అవివేకిగా చేసుకొనువాడు తప్ప? వాస్తవానికి మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) ఈ లోకంలో ఎన్నుకున్నాము. మరియు నిశ్చయంగా, అతను పరలోకంలో సద్వర్తనులతో పాటు ఉంటాడు.

తఫ్సీర్

మరియు తన అవివేకము వలన,తన దురాలోచనతో సన్మార్గమును వదిలి మార్గ భ్రష్టతకు లోనై ,తన మనసు కొరకు దిగజార్చుకోవటంను ఇష్టపడి తన పై హింసకు పాల్పడిన వాడు తప్ప ఇంకెవరు ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మాన్ని వదిలి వేరే ధర్మాల వైపు మరలిపోడు.మరియు మేము అతనిని ఇహ లోకంలో ఒక ప్రవక్తగా మరియు మిత్రునిగా ఎన్నుకున్నాము.మరియు నిశ్చయంగా అతను పరలోకంలో అల్లాహ్ తమపై విధిగావించిన వాటిని పూర్తి చేసి ఉన్నత స్థానాలను పొందే పుణ్యాత్ముల్లోంచి అవుతాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి