సూరా 2 · జుజ్ 1
Al-Baqarah · 2:129
رَبَّنَا وَابْعَثْ فِيهِمْ رَسُولًا مِنْهُمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِكَ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَيُزَكِّيهِمْ ۚ إِنَّكَ أَنْتَ الْعَزِيزُ الْحَكِيمُ
"ఓ మా ప్రభూ! వీరిలో నుండి నీ సందేశాలను చదివి వినిపించుటకునూ, నీ గ్రంథాన్ని నేర్పుటకునూ, దివ్యజ్ఞానాన్ని బోధించుటకునూ మరియు వారిని పరిశుద్ధులుగా మార్చుటకునూ ఒక సందేశహరుణ్ణి పంపు. నిశ్చయంగా, నీవే సర్వ శక్తిమంతుడవు, మహా వివేకవంతుడవు."
తఫ్సీర్
ఓ మా ప్రభు ఇస్మాయీల్ సంతతి నుంచి వారిలో ఒక ప్రవక్తను పంపు.అతడు అవతరింపజేయబడిన నీ వాక్యాలను వారి ముందు చదివి వినిపిస్తాడు.మరియు వారికి ఖుర్ఆన్,సున్నత్ ను నేర్పిస్తాడు.షిర్క్,మరియు దుర్గుణాల నుండి వారిని పరిశుద్ధ పరుస్తాడు. నిశ్చయంగా నీ కార్య నిర్వహణ,మరియు నీఆదేశాలలో నీవు సర్వశక్తిమంతుడవు మరియు మహావివేకవంతుడవు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి