సూరా 17 · జుజ్ 15
Al-Isra · 17:57
أُولَٰئِكَ الَّذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إِلَىٰ رَبِّهِمُ الْوَسِيلَةَ أَيُّهُمْ أَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُ وَيَخَافُونَ عَذَابَهُ ۚ إِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَحْذُورًا
వారు, ఎవరినైతే వీరు ప్రార్థిస్తూ ఉన్నారో, వారే తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు. మరియు వారిలో ఆయనకు ఎవరు ఎక్కువ సాన్నిధ్యం పొందుతారో అని ప్రయత్నిస్తున్నారు. మరియు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు మరియు ఆయన శిక్షకు భయపడుతున్నారు. నిశ్చయంగా నీ ప్రభువు శిక్ష, దానికి భయపడ వలసిందే!
తఫ్సీర్
వారందరు ఎవరినైతే పిలుస్తున్నారో దైవదూతలు,వారిలాంటివారు వారే స్వయంగా తమకు సామిప్యమును కలిగించే సత్కార్యమును కోరుకుంటారు. మరియు వారిలో ఎవరు విధేయత ద్వారా ఎక్కువ దగ్గరవుతారని పోటీపడుతారు. మరియు ఆయన వారిపై దయ చూపాలని ఆశిస్తున్నారు. వారిని ఆయన శిక్షిస్తాడని భయపడుతున్నారు. ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు శిక్ష జాగ్రత్తపడవలసిన వాటిలోంచిది.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి