సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:56

قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُمْ مِنْ دُونِهِ فَلَا يَمْلِكُونَ كَشْفَ الضُّرِّ عَنْكُمْ وَلَا تَحْوِيلًا

వారితో ఇట్లను: "ఆయన (అల్లాహ్) ను కాదని మీరెవరినైతే (ఆరాధ్యదైవాలుగా) భావించారో, వారిని అర్థించి చూడండి; మీ ఆపదను తొలగించటానికి గానీ, దానిని మార్చటానికి గానీ వారికి ఎలాంటి శక్తి లేదు."

తఫ్సీర్

ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : ఓ ముష్రికులారా మీరు ఎవరినైతే అల్లాహ్ ను వదిలి దైవాలుగా భావిస్తున్నారో వారిని వేడుకోండి ఒక వేళ మీకు ఏదైన నష్టం వాటిల్లితే వారికి మీ నుండి నష్టమును తొలగించే అధికారం లేదు మరియు వారి అశక్తి వలన దాన్ని మీ నుండి ఇతరులకు మరలించే అధికారం లేదు. ఎవరైతే అశక్తుడై ఉంటాడో వాడు దైవం కాజాలడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి