సూరా 17 · జుజ్ 15
Al-Isra · 17:55
وَرَبُّكَ أَعْلَمُ بِمَنْ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَلَقَدْ فَضَّلْنَا بَعْضَ النَّبِيِّينَ عَلَىٰ بَعْضٍ ۖ وَآتَيْنَا دَاوُودَ زَبُورًا
మరియు భూమ్యాకాశాలలో ఉన్న వారందరినీ గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు. మరియు వాస్తవానికి మేము కొందరు ప్రవక్తలకు మరికొందరిపై ఘనత నొసంగాము. మరియు మేము దావూద్ కు జబూర్ ఇచ్చాము.
తఫ్సీర్
ఓ ప్రవక్తా భూమ్యాకాశముల్లో ఉన్న వారందరి గురించి మీ ప్రభువు బాగా తెలిసినవాడు,వారి స్థితిగతుల గురించి,వారు దేనికి హక్కుదారులో దాని గురించి బాగా తెలిసిన వాడు. నిశ్చయంగా మేము కొందరు ప్రవక్తలను కొందరిపై అనుసరులను అధికం చేసి,గ్రంధములను అవతరింపజేసి ప్రాధాన్యతను కలిగించాము. మరియు మేము దావుద్ నకు జబూర్ గ్రంధమును ప్రసాధించాము.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి