సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:44

تُسَبِّحُ لَهُ السَّمَاوَاتُ السَّبْعُ وَالْأَرْضُ وَمَنْ فِيهِنَّ ۚ وَإِنْ مِنْ شَيْءٍ إِلَّا يُسَبِّحُ بِحَمْدِهِ وَلَٰكِنْ لَا تَفْقَهُونَ تَسْبِيحَهُمْ ۗ إِنَّهُ كَانَ حَلِيمًا غَفُورًا

సప్తాకాశాలు, భూమి మరియు వాటిలో ఉన్న సమస్తమూ ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయన పవిత్రతను కొనియాడనిది, ఆయన స్తోత్రం చేయనటువంటిది ఏదీ లేదు, కాని మీరు వాటి స్తుతిని అర్థం చేసుకోలేరు. నిశ్చయంగా, ఆయన ఎంతో సహనశీలుడు, క్షమాశీలుడు.

తఫ్సీర్

ఆకాశములు అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడుతున్నవి,భూమి అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడుతున్నది, భూమ్యాకశముల్లో ఉన్న సమస్త సృష్టిరాసులు అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడుతున్నవి. ఆయన స్థుతులని కలుపుతూ ఆయనదే పరిశుద్ధతను కొనియాడని ఏ వస్తువూ లేదు. కాని వారు పరిశుద్ధతను కొనియాడే వైనమును మీరు అర్ధం చేసుకోలేరు. మీరు మాత్రం మీ భాషలో పరిశుద్ధతను కొనియాడేవారి పరిశుద్ధతను కొనియాడటమును మాత్రమే అర్ధం చేసుకుంటారు. నిశ్చయంగా మహోన్నతుడైన ఆయన శిక్షను తొందర చేయని సహనశీలుడు,తన వద్ద పశ్చాత్తాప్పడిన వారిని మన్నించేవాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి