సూరా 17 · జుజ్ 15
Al-Isra · 17:42
قُلْ لَوْ كَانَ مَعَهُ آلِهَةٌ كَمَا يَقُولُونَ إِذًا لَابْتَغَوْا إِلَىٰ ذِي الْعَرْشِ سَبِيلًا
వారితో అను: "ఒకవేళ వారు వారన్నట్లు అల్లాహ్ తో పాటు ఇతర ఆరాధ్య దైవాలే ఉన్నట్లైతే, వారు కూడా (అల్లాహ్) సింహాసనానికి (అర్ష్ కు) చేరే మార్గాన్ని వెతికే వారు కదా!"
తఫ్సీర్
ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : ఒక వేళ మహోన్నతుడైన అల్లాహ్ తోపాటు వీరు కల్పించుకుని,అబధ్ధమాడుతూ పలికినట్లే ఆరాధ్యదైవాలే గనక ఉంటే అప్పుడు ఆ భావించబడిన ఆరాధ్య దైవాలు సింహాసనాధిపతి అయిన అల్లాహ్ వైపునకు ఆయన రాజ్యముపై ఆధిక్యతను పొందటాన్ని కోరుకునేవారు,ఆ విషయంలో ఆయనతో తగువులాడేవారు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి