సూరా 17 · జుజ్ 15
Al-Isra · 17:22
لَا تَجْعَلْ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَقْعُدَ مَذْمُومًا مَخْذُولًا
(ఓ మానవుడా!) అల్లాహ్ కు తోడుగా మరొక ఆరాధ్య దైవాన్ని కల్పించకు. అలా చేస్తే నీవు అవమానించబడి సహకారాలు పొందని (త్యజించబడిన) వాడవవుతావు.
తఫ్సీర్
ఓ దాసుడా నీవు అల్లాహ్ తోపాటు ఆరాధించటానికి వేరే ఆరాధ్య దైవమును చేసుకోకు. అటువంటప్పుడు నీవు అల్లాహ్ వద్ద,ఆయన పుణ్య దాసుల వద్ద నిన్ను పొగిడే వారు లేకుండా అవమానించబడిన వాడివైపోతావు. నీకు సహాయం చేసేవాడు ఎవడూ లేక ఆయన వద్ద నుండి పరాభవమునకు గురైన వాడివైపోతావు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి