సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:23

۞ وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا ۚ إِمَّا يَبْلُغَنَّ عِنْدَكَ الْكِبَرَ أَحَدُهُمَا أَوْ كِلَاهُمَا فَلَا تَقُلْ لَهُمَا أُفٍّ وَلَا تَنْهَرْهُمَا وَقُلْ لَهُمَا قَوْلًا كَرِيمًا

మరియు నీ ప్రభువు: తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదనీ మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలనీ, ఆజ్ఞాపించి ఉన్నాడు. ఒకవేళ వారిలో ఏ ఒక్కరు గానీ, లేదా వారిరువురు గానీ ముసలివారైతే, వారితో విసుక్కుంటూ: "ఛీ! (ఉఫ్)" అని కూడా అనకు మరియు వారిని గద్దించకు మరియు వారితో మర్యాదగా మాట్లాడు.

తఫ్సీర్

మరియు ఓ దాసుడా నీ ప్రభువు అతనిని తప్ప ఇంకొకరిని ఆరాధించకూడదని ఆదేశించి అనివార్యం చేశాడు. మరియు తల్లిదండ్రుల పట్ల ప్రత్యేకించి వారు వృద్ధాప్యమునకు చేరినప్పుడు మంచిగా మెలగమని ఆదేశించాడు. ఒక వేళ నీ దగ్గర తల్లిదండ్రుల్లోంచి ఎవరైన ఒకరు లేదా ఇద్దరూ వృద్ధాప్యమునకు చేరుకుంటే నీవు వారితో విసుగు చెందే విధంగా మాట్లాడకు, వారిని కసురుకోకు,వారిపై మాటల్లో కఠినత్వమును చూపకు. మరియు వారితో మృదువుగా,దయగా ఉన్నట్లు మర్యాదగా మాట్లాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి