సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:21

انْظُرْ كَيْفَ فَضَّلْنَا بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ ۚ وَلَلْآخِرَةُ أَكْبَرُ دَرَجَاتٍ وَأَكْبَرُ تَفْضِيلًا

చూడండి! మేము కొందరికి మరికొందరిపై ఏ విధంగా ఘనత నొసంగామో! కాని పరలోక (జీవిత సుఖ) మే గొప్ప స్థానాలు గలది మరియు గొప్ప ఘనత గలది.

తఫ్సీర్

ఓ ప్రవక్తా మేము ఏ విధంగా వారిలో కొందరిని కొందరిపై ఇహ లోకములో జీవనోపాధిలో,స్థానముల్లో ప్రాధాన్యతను కల్పించామో మీరు యోచించండి. మరియు పరలోకము ఇహలోకము కన్న అనుగ్రహాల స్థానముల విషయంలో హెచ్చుతగ్గులు అవటంలో ఉన్నతమైనది,ప్రాధాన్యత నివ్వటంలో గొప్పది. విశ్వాసపరుడు దాన్ని పొందటం కొరకు అత్యాశను చూపాలి.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి