సూరా 16 · జుజ్ 14

An-Nahl · 16:62

وَيَجْعَلُونَ لِلَّهِ مَا يَكْرَهُونَ وَتَصِفُ أَلْسِنَتُهُمُ الْكَذِبَ أَنَّ لَهُمُ الْحُسْنَىٰ ۖ لَا جَرَمَ أَنَّ لَهُمُ النَّارَ وَأَنَّهُمْ مُفْرَطُونَ

మరియు వారు తమకు ఇష్టం లేని దానిని అల్లాహ్ కొరకు నియమిస్తారు. "నిశ్చయంగా, వారికి ఉన్నదంతా శుభమే (మేలైనదే)." అని వారి నాలుకలు అబద్ధం పలుకుతున్నాయి. నిస్సందేహంగా, వారు నరకాగ్ని పాలవుతారు. మరియు నిశ్చయంగా, వారందులోకి త్రోయబడి, వదలబడతారు.

తఫ్సీర్

మరియు వారు తమకు ఆడ సంతానముతో సంబంధం చూపటం ఇష్టం లేని వాటిని అల్లాహ్ కొరకు అంటగడుతున్నారు.మరియు వారి కొరకు అల్లాహ్ వద్ద మంచి స్థానం ఉందని వారి నాలుకలు అబధ్ధం పలుకుతున్నవి.ఒక వేళ వారు పలుకుతున్నట్లు సరైనదై ఉంటే వారు మరల లేపబడుతారు.వాస్తవానికి నిశ్చయంగా వారి కొరకు నరకాగ్ని ఉన్నది.మరియు వారు అందులో విసిరివేయబడుతారు.దాని నుండి వారు ఎన్నటికి బయటకు రాలేరు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి