సూరా 16 · జుజ్ 14

An-Nahl · 16:63

تَاللَّهِ لَقَدْ أَرْسَلْنَا إِلَىٰ أُمَمٍ مِنْ قَبْلِكَ فَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ فَهُوَ وَلِيُّهُمُ الْيَوْمَ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ

అల్లాహ్ తోడు, (ఓ ప్రవక్తా!) వాస్తవానికి, నీకు పూర్వమున్న సమాజాల వారి వద్దకు, మేము ప్రవక్తలను పంపాము! కాని షైతాన్ వారి (దుష్ట) కర్మలను వారికి మంచివిగా కనిపించేటట్లు చేశాడు. అదే విధంగా ఈనాడు కూడా వాడు వారి స్నేహితుడిగా ఉన్నాడు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

తఫ్సీర్

ఓ ప్రవక్తా అల్లాహ్ సాక్షిగా నిశ్చయంగా మేము మీకన్నా మునుపు జాతుల వారి వద్దకు ప్రవక్తలను పంపించాము. అయితే షైతాను వారి దుష్కర్మలైన బహుదైవారాధన,అవిశ్వాసము,పాపకార్యాలను మంచిగా చేసి చూపించాడు. అయితే అతడు ప్రళయదినాన వారికి సహాయకుడిగా భావించబడ్డాడు. అయితే వారు అతన్ని సహాయం కోరాలి. మరియు వారి కొరకు ప్రళయ దినాన బాధాకరమైన శిక్ష కలదు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి