సూరా 16 · జుజ్ 14

An-Nahl · 16:61

وَلَوْ يُؤَاخِذُ اللَّهُ النَّاسَ بِظُلْمِهِمْ مَا تَرَكَ عَلَيْهَا مِنْ دَابَّةٍ وَلَٰكِنْ يُؤَخِّرُهُمْ إِلَىٰ أَجَلٍ مُسَمًّى ۖ فَإِذَا جَاءَ أَجَلُهُمْ لَا يَسْتَأْخِرُونَ سَاعَةً ۖ وَلَا يَسْتَقْدِمُونَ

మరియు ఒకవేళ అల్లాహ్ మానవులను - వారు చేసే దుర్మార్గానికి - పట్టుకో దలిస్తే, భూమిపై ఒక్క ప్రాణిని కూడ వదిలేవాడు కాదు. కాని, ఆయన ఒక నిర్ణీత కాలం వరకు వారికి వ్యవధినిస్తున్నాడు. ఇక, వారి కాలం వచ్చినప్పుడు వారు, ఒక ఘడియ వెనుక గానీ మరియు ముందు గానీ కాలేరు.

తఫ్సీర్

ఒక వేళ పరిశుద్ధుడైన అల్లాహ్ ప్రజలను వారి దుర్మార్గము వలన,ఆయనపట్ల వారి అవిశ్వాసం వలన శిక్షిస్తే భూ ఉపరితలంపై సంచరించే ఏ మానవుడిని,ఏ జంతువుని వదలడు. కాని పరిశుద్ధుడైన ఆయన వారిని తన జ్ఞానములో నిర్ణయించబడిన సమయం వరకు గడువిస్తాడు. తన జ్ఞానములో నిర్ణీత ఆ గడువు వచ్చినప్పుడు వారు దాని నుండి వెనుకకు కాలేరు మరియు ముందుకు కాలేరు. ఒక వేళ అది కొంచెం సమయమైన కూడా .

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి