Al-Fatihah

سورة الفاتحة

సూరా 1 · మక్కీ · 7 ఆయత్‌లు

1:1 · Al-Fatihahజుజ్ 1 · పు. 1

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ1

అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో
1:2జుజ్ 1 · పు. 1

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ2

సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు.
1:3జుజ్ 1 · పు. 1

الرَّحْمَٰنِ الرَّحِيمِ3

అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత
1:4జుజ్ 1 · పు. 1

مَالِكِ يَوْمِ الدِّينِ4

తీర్పుదినానికి స్వామి
1:5జుజ్ 1 · పు. 1

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ5

మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము
1:6జుజ్ 1 · పు. 1

اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ6

మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి
1:7జుజ్ 1 · పు. 1

صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ7

నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Muhammad Ayyub - Al-Fatihah · Tlawati