సూరా 9 · జుజ్ 10

At-Tawbah · 9:67

الْمُنَافِقُونَ وَالْمُنَافِقَاتُ بَعْضُهُمْ مِنْ بَعْضٍ ۚ يَأْمُرُونَ بِالْمُنْكَرِ وَيَنْهَوْنَ عَنِ الْمَعْرُوفِ وَيَقْبِضُونَ أَيْدِيَهُمْ ۚ نَسُوا اللَّهَ فَنَسِيَهُمْ ۗ إِنَّ الْمُنَافِقِينَ هُمُ الْفَاسِقُونَ

కపట విశ్వాసులైన పురుషులు మరియు కపట విశ్వాసులైన స్త్రీలు అందరూ ఒకే కోవకు చెందినవారు! వారు అధర్మాన్ని ఆదేశిస్తారు. మరియు ధర్మాన్ని నిషేధిస్తారు. మరియు తమ చేతులను (మేలు నుండి) ఆపుకుంటారు. వారు అల్లాహ్ ను మరచిపోయారు, కావున ఆయన కూడా వారిని మరచిపోయాడు. నిశ్చయంగా, ఈ కపట విశ్వాసులే అవిధేయులు (ఫాసిఖూన్).

తఫ్సీర్

కపట విశ్వాస పురుషులు,స్త్రీలు అందరూ కపట లక్షణాల్లో ఒక్కటే.వారు విశ్వాసపరులకు విరుద్ధంగా ఉంటారు.వారు చెడును గురించి ఆదేశిస్తారు,మంచి నుండి వారిస్తారు.వారు తమ సంపదలో పిసినారితనాన్ని చూపి వాటిని వారు అల్లాహ్ మార్గములో ఖర్చు చేయరు.అల్లాహ్ పై విధేయత చూపటమును వారు వదిలివేశారు.అల్లాహ్ వారిని దాని అనుగ్రహము నుండి వదిలివేశాడు.నిశ్చయంగా కపటులు అల్లాహ్ విధేయత నుండి,సత్య మార్గము నుండి ఆయన అవిధేయత వైపునకు,అపమార్గము వైపునకు వైదొలగిపోతున్నారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి